బారి ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరికలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి, హన్మజిపేట గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్ లు,మాజీ వైస్ ఎంపీపీ, మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు సభ్యులు, సింగిల్ విండో డైరెక్టర్లు సుమారు 200 మంది బిజెపి బిఆర్ఎస్ నాయకులు రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయా గ్రామ శాఖల సమన్వయంతో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.వారికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.

 Joining The Congress Party At Bari Level , Whip Adi Srinivas, Congress Party-TeluguStop.com

వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు.పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా రాష్ట్రంలోని ప్రజలకు న్యాయం జరగాలన్న కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైతుందని తెలిపారు.

గత కొన్ని సంవత్సరాలుగా బిజెపి బిఆర్ఎస్ పార్టీలలో సుదీర్ఘ కాలం పనిచేస్తున్న సరైన గుర్తింపు దక్కలేదని అన్నారు.రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు.

ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో దావోస్ పర్యటన విజయవంతంగా ముగించుకొని నేడు రాష్ట్రానికి తిరిగి వచ్చారని వారు లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్ల పెట్టుబడులతో సుమారు 49 వేల పై చిలుకు ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు.ప్రజలు ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మార్చి వారు సుదీర్ఘకాలం పనిచేసిన పార్టీలను వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుందన్నారు.

కొత్త పాత అనే తేడా లేకుండా కలిసికట్టుగా రానున్న ఎన్నికల్లో విజయం లక్ష్యంగా పనిచేయాలని సూచించారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube