ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల మంజూరు పై సంబరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేస్తున్న ఉద్యమాల ఫలితంగా ప్రభుత్వం తలొగ్గి డిగ్రీ కళాశాల మంజూరు చేసిందని ఇది ముమ్మాటికి ఎస్ఎఫ్ఐ పోరాట ఫలితం అని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్ర రాకేష్ అన్నారు.అనంతరం విద్యార్థులతో కలిసి టపాసులు పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

 Sfi Celebrations Over Govt Degree College Sanction To Ellareddypet, Sfi , Govt D-TeluguStop.com

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్ర రాకేష్ మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేటలో డిగ్రీ కళాశాల ఏర్పాటు అనేది విద్యార్థుల చిరకాల కాంక్ష అని నిత్యం ఎల్లారెడ్డిపేటకు వందలాది మంది విద్యార్థులు ఇంటర్ విద్య అభ్యసించడానికి వస్తున్నారని, ఇంటర్ పూర్తయిన విద్యార్థులు డిగ్రీ కోసం వివిధ దూర ప్రాంతాలకు వెళ్లి ప్రైవేట్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నారని మండలంలో చాలా మంది పేద విద్యార్థులు ఉన్నారని వాళ్లందరూ ప్రైవేట్ లో చదివి ఆర్థిక స్థోమత లేదని,

తమ చదువులను మధ్యలో ఆపేసి గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారని అందుకోసమని డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని దశలవారిగా ఎస్ఎఫ్ఐ పోరాటం నిర్వహించిందని ఎట్టకేలకు ఎస్ఎఫ్ఐ పోరాట ఫలితంగా డిగ్రీ కళాశాల మంజూరు చేయడం జరిగిందనీ అన్నారు.ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తెలిపారు.

భవిష్యత్తులో విద్యారంగ సమస్యల పరిష్కారంలో కూడా ఎస్ఎఫ్ఐ ఎల్లప్పుడు ముందుంటుందని విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ముందుండే ఎస్ఎఫ్ఐ సంఘంలో చేరి విద్యార్థులు తమ హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు అభిలాష్, దిలీప్, సంతోష్, రాకేష్, నవ్య, అక్షయ, తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube