రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ రజిత రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఏఎన్ఎం లకు జిల్లాలో గల ఐఎంఏ హాల్ నందు సమీకృత అధిక ప్రమాద గర్భాధారణ నిర్వహణ నియమాలు, శిక్షణ తెలంగాణ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి5 గంటల వరకు నిర్వహించడం జరిగింది.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీ చరిత్ర తెలుసుకొనుట, రక్తహీనత, అధిక రక్తపోటు, పశువపూర్వ రక్తస్రావం, మూర్చ రోగం, కామెర్లు, గత సిజేరియన్ సెక్షన్, గుండె జబ్బుతో గర్భాధారణ, గర్భాధారణలో ఊపిరి ఆడకపోవడం, పిండం ఎదుగుదల పరిమితి, గర్భం సమయములో 20 వారాలకు ముందు రక్తస్రావం అవడం, నెలలు నిండకుండానే ప్రసవం, గర్భాదరణ సమయంలో హెచ్ఐవి, తగ్గిన పిండం కదలికలు, మానసిక ఆరోగ్యం, గర్భాదరణ సమయంలో బరువు పెరుగుట, పెరినియల్ ట్రామా నివారణ లాంటివి గుర్తించాలని శిక్షణ ఇచ్చి మాతృ మరణాలను శిశు మరణాలను తగ్గించాలని.
ఈ శిక్షణా కార్యక్రమమును పి ఓ ఎం హెచ్ ఎన్ డాక్టర్ అంజలినా ఆల్ఫ్రెడ్, డాక్టర్ అఖిల, డాక్టర్ సౌజన్య మరియు ఐ హెచ్ ఆర్ పి టి యం డైరెక్టర్ డాక్టర్ చేతన్ హైదరాబాద్ , డీడియం కార్తీక్ గార్లు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించినారు.