విద్యార్థులు చదువుతో పాటు సైబర్ నేరాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ పై అవగాహన పెంపొందించుకోవాలి.

“ఖాకీ కిడ్స్”లో భాగంగా సైబర్ నేరలపై,ట్రాఫిక్ నియమలపై పోలీస్ వారు చెప్పిన సూచనలపై తల్లిదండ్రులకు,ప్రజలకు అవగాహన కల్పించాలి.

 Students Should Develop Awareness About Cybercrime And Traffic Signals Along Wit-TeluguStop.com

శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల శ్రేయస్సుకు జిల్లా పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలు అభినందనీయం.

“ఖాకీ కిడ్స్” కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్.

రాజన్న సిరిసిల్ల జిల్లా :సైబర్ నేరాల నియంత్రణయే లక్ష్యంగా విద్యార్థి దశ నుండి విద్యార్థులకు సైబర్ నేరలపై, ట్రాఫిక్ సిగ్నల్స్ పై అవగాహన కల్పించి సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాడమే లక్ష్యంగా “ఖాకీ కిడ్స్” కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జిల్లా ఎస్పీ.

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఖాకీ కిడ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, లైబ్రరీ చైర్మన్ సత్యనారాయణ, విద్యార్థులు,పోలీస్ అధికారులతో కలసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ….

ఎక్కడైతే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయో అక్కడే అభివృద్ధి సాధ్యంమని, పోలీసు శాఖ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తుందని,జిల్లా పోలీస్ శాఖ ప్రజలకు చేరువగా యువతకు క్రీడా పోటీలు, ఆరోగ్య శిబిరాలు,డ్రైవింగ్ లెసైన్స్, సీసీ కెమెరాల ఎర్పాటు మొదలగు సామాజిక కార్యక్రమాలు చేపడుతూ, శాంతి భద్రతల పరిరక్షణతో పాటుగా ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా జిల్లా పోలీసులు పని తీరు అభినందనీయం అన్నారు.

ప్రస్తుతం సమాజంలో సైబర్ నేరగాళ్లు కొంత కొంత మోసలతో ప్రజలను మోసాగిస్తున్నారని, అట్టి మోసాల బారిన ప్రజలు పడకూడదనే ఉద్దేశ్యంతో ప్రతి పోలీస్ స్టేషన్లలో సైబర్ వారియర్ లను ఎంపిక చేసి వారికి సైబర్ నేరాలు జరుగు విధానం,ట్రాఫిక్ నియమలపై శిక్షణ ఇచ్చి జిల్లాలో ఉన్న అన్ని కళాశాల్లో, పాఠశాలల్లో విద్యార్థులకు ఇంటర్నెట్ దుర్వినియోగం, ఆన్‌లైన్ మోసాలు,సైబర్ మోసాల భారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నారు.

విద్యార్థులు ఖాకి కిడ్స్ కార్యక్రమన్ని సద్వినియోగం చేసుకొని తల్లిదండ్రులకి,కుటుంబ సభ్యులకు, ప్రజలకు అవగాహన కల్పింఛాలన్నారు.

విద్యార్థులు మంచిని స్వికరించి చెడుకు దూరంగా ఉండాలని, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి లను స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్ లో ఉన్నత స్థానాల్లో స్థిరపడి తల్లితండ్రులకు,పుట్టిన గ్రామానికి గొప్ప పేరు తీసుకురావాలని,సంకల్పం, మనోబలం ఉంటే మనం అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చాని అన్నారు.

విద్యార్థుల జీవితంలో పదవ తరగతి పరీక్షలు మొదటి అడుగని,మార్చ్ లో నిర్వహించే పదవ తరగతి పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు.రాజన్న ఆలయంలో ఇటీవల జరిగిన పాప అపహరణ కేసును చాకచక్యంగా ఛేదించి రాష్ట్ర స్థాయిలో జిల్లా పోలీస్ వారు మంచి పెరు తెచ్చుకున్నారని గుర్తు చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తల్లిదండ్రులు, ప్రజలు పిల్లలు చెప్పితే తప్పక పాటిస్తారనే ఉద్దేశ్యంతో ఖాకీ కిడ్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న సైబర్ వారియర్లకు సైబర్ నేరాలకు జరుగు విధానం,ఎలా అరికట్టాలి, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించి రానున్న మూడు నెలల్లో జిల్లాలో ఉన్న అన్ని కళాశాలలో,పాఠాశాలలోని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అనంతరం గ్రామాలలోని ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుదన్నారు.

విద్యార్థులు సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని, ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలలో వ్యక్తిగత గోప్యత పాటించాలని,ప్రస్తుతం ఎక్కువగా వస్తున్న డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ఓటిపి ఫ్రాడ్, సోషల్ మీడియాలో వచ్చే ఉద్యోగ ప్రకటనలు,అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే విడియో కాల్స్ కుఫ్రాడ్, olx ఫ్రాడ్ లాంటి వాటికి దూరంగా ఉండాలన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ స్వరూప, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి,సి.ఐ లు కృష్ణ, శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, ఆర్.ఐ లు మధుకర్, రమేష్ ,ఎస్.ఐ లు ,విద్యార్థులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube