రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు నన్ను గెలిపిస్తే వారి సంరక్షణ కోసం సంరక్షణ చట్టం తీసుకువస్తానని కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నియోజకవర్గాల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న యాదగిరి శేఖర్ రావు అన్నారు.శనివారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాయి శివ గార్డెన్స్ లో మండలంలో గల వివిధ ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి స్వతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు సంరక్షణ చట్టం తీసుకువస్తానని,నా బలం బలగం మీరే అని అయినా అన్నారు.
కరోనా సమయంలో దాదాపు రెండు లక్షల 21 వేల ప్రైవేట్ ఉపాధ్యాయులకు 25 కేజీల బియ్యం, 2వేల రూపాయలు గత ప్రభుత్వంతో తను పోరాడి ఇప్పించడం జరిగిందని అన్నారు.నన్ను పట్టబద్ధులు ఎమ్మెల్సీగా గెలిపిస్తే పది లక్షల హెల్త్ కార్డుతో పాటు, 10 లక్షల ఆరోగ్య బీమా, అందిస్తానని భరోసా ఇచ్చారు.ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు షుగర్, బిపి, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్, లాంటి వ్యాధులతో ప్రవేట్ ఉపాధ్యాయులు బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నాన్ టీచింగ్ డ్రైవర్స్ , ఆయాలకు, సైతం హెల్త్ ఇన్సూరెన్స్ వర్తింపజేసే విధంగా పోరాడతానని పేర్కొన్నారు, రాష్ట్రంలో 1995-2000 సంవత్సరాలలో ప్రైవేట్ పాఠశాలల కారణంగా 78% అక్షరాస్యత పెరిగిందని అన్నారు.61 సంవత్సరాలు నిండిన వారికి దాదాపుగా పదివేల రూపాయల పింఛన్ వచ్చే విధంగా, పోరాటం చేస్తానని, ప్రైవేట్ టీచర్లను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని, అన్నారు.2016 వ సంవత్సరం పూర్వం రాష్ట్రంలోని 8 వేల ప్రైవేట్ పాఠశాలలకు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, లకు ప్రభుత్వం నుండి తను పర్మిషన్ ఇప్పించానని అన్నారు.నాకు ఎలాంటి బిజినెస్లు లేవు, సంక్షేమమే నా ధ్యేయమని, పేర్కొన్నారు.2021 నుండి విద్యార్థులకు 8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని అన్నారు.దీంతో రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను నిర్వీణ్యం చేయాలని కుట్రలు పన్నుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల నుండి సుంకం తీసుకొని దానిలో 10 శాతం కూడా విద్యావ్యవస్థకు కేటాయించడం లేదని, పాలకులు, పాలితులు, మధ్య అగాధం పూడ్చడానికి తాను ప్రయత్నం చేస్తానని అన్నారు.ప్రభుత్వ ఖజానా ఖాళీ కావడంతో , మార్చ్ 31న 10 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చేస్తున్నారని, వారికి ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని వారి కాల పరిమితిని 64 సంవత్సరాలకు పెంచాలని రాష్ట్ర సర్కారు భావిస్తుందని అన్నారు.
నాలుగు నియోజకవర్గాల పరిధిలో 20 లక్షల మంది పట్టబద్రులు ఉండగా కేవలం నాలుగు లక్షల మంది మాత్రమే ఓటర్గా నమోదు చేసుకున్నారని అన్నారు.ఈ సమావేశంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి లతీఫ్, మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ, శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్, మాస్టర్ మైండ్ స్కూల్ ప్రిన్సిపాల్, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.