రాజన్న సిరిసిల్ల జిల్లా: దొంగతనం కేసులో వ్యక్తికి ఒకసంవత్సరము జైలు శిక్షతో పాటు రెండు వందల రూపాయల జరిమాన విధిస్తూ సిరిసిల్ల ప్రథమశ్రేణి న్యాయమూర్తి కే.సృజన తీర్పు వెల్లడించినట్లు ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.
శ్రీనివాస్ తెలిపారు.సి ఐ తెలిపిన వివరాల ప్రకారం దొంగకు శిక్ష ,జరిమాన విధించిన సమాచారం ఇలా వుంది.
ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి లో నివసిస్తున్న పిల్లి రణధీర్ కుటుంబం గత ఏడాది అక్టోబర్ 8 న మధ్యాహ్నం సమయంలో ఇంటికితాళం వేసి ఊరెళ్ళారు.
అదే రోజు సాయంత్రం ఆరు గంటల సమయంలో వారి ఇంటి గేటు తాళం పగులగొట్టబడి వుండటం వాళ్ల ఇంటి ప్రక్కనే వున్న కొండలత అనే మహిళ చూసి రణదీరుకు ఫోన్ చేసి గేటు తాళం పగుల కొట్టి వుందని తెలిపింది.
వెంటనే రణధీర్ భార్యను అక్క కొండ వానిలతోకలిసి ఇంటికి వెళ్లి చూడగా అతని ఇంటికి వేసిన తాళం పగలగొట్టి ఉండి వుంది.ఇంటిలోపలికి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉంది.
అందులో తను దాచిన రెండు లక్షల రూపాయలు నగదు, తన భార్యకు చెందిన ఒక జత అర తులం బంగారు చెవి కమ్మలు, కూతురు లక్ష్మీ క్రాంతి వి అర తులం బంగారు చెవి కమ్మలు పోయినట్లు గుర్తుతెలియ దొంగలు దొంగతనం చేసినారని పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు.
బాధితుడిచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఎస్సై రమాకాంత్ దర్యాప్తులో భాగంగా రణధీర్ ఇంట్లో దొంగతనం చేసిన మహారాష్ట్ర లోని పర్భని ప్రాంతం ఎం ఎం పహడి కి చెందిన షేక్ కయ్యుo 21 గా గుర్తించి అతడిని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించరు.
దొంగతనం కేసులో విచారణ అనంతరం విచారణ అధికారి అయిన ఎస్ ఐ రమాకాంత్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశాడు.సి ఎం ఎస్ ఎస్.ఐ.రవీందర్ నాయుడు, కోర్టు కానిస్టేబుల్ శంకర్ ఆధ్వర్యంలో నేరస్తుడు కయ్యూం దొంగతనం తానే చేసినట్లునేరం ఒప్పుకున్నందున న్యాయమూర్తి కే.సృజన నేరస్తుడు అయిన షేక్ ఖయ్యూం అలియాస్ రఫిక్ బేగ్ ఒక సంవత్సరo కఠిన కారాగార జైలు శిక్ష తో పాటు రెండు వందలరూపాయల జరిమానా విధించారు.