టీ.కోట్లాది మంది ప్రజలకు ఈ పానీయంతో విడదీయలేని సంబంధం ఉంది అనడంలో సందేహం లేదు.
ఉదయం లేవగానే ఒక కప్పు టీ తాగే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది.కొందరైతే టీ తాగనిదే ఏ పని చేయరు.
అందులోనూ ప్రస్తుత చలికాలం( Winter Season )లో నిద్ర లేవగానే కడుపులో టీ పడితే కానీ సెట్ అవ్వలేము.అయితే చలికాలంలో ఇమ్యూనిటీ సిస్టం సహజంగానే వీక్ అవుతుంది.
అందువల్ల ఈ సీజన్ లో టీని నేరుగా కాకుండా ఇప్పుడు చెప్పబోయే మూడు రకాల స్పైసెస్ ను కలిపి తీసుకుంటే మీ ఇమ్యూనిటీ పవర్ అద్భుతంగా రెట్టింపు అవుతుంది.మరి ఇంతకీ ఆ మూడు రకాల స్పైసెస్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
టీ( Tea )కు చక్కని రుచి, ఫ్లేవర్ ను అందించడంలో యాలకులకు పోటీ మరొకటి ఉండదు.రోజు టీ లో దంచిన రెండు యాలకులు వేసి మరిగిస్తే టేస్ట్ అదిరిపోతుంది.పైగా యాలకులను( Cardamom ) వాడటం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మన రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. ఇన్ఫెక్షన్స్( Infections ) తో పోరాడే శక్తిని సమకూరుస్తాయి.
అదే సమయంలో శ్వాస సంబంధిత సమస్యలు ఏమైనా ఉన్నా కూడా దూరం అవుతాయి.
అలాగే చలికాలంలో రోజూ టీలో యాడ్ అవ్వాల్సిన మరొక స్పేస్ అల్లం.
అల్లం వల్ల ఇమ్యూనిటీ పెరగడమే కాదు జీర్ణక్రియ మెరుగుపడుతుంది.గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది.
పైగా టీలో అల్లం ను చేర్చడం వల్ల కీళ్ల నొప్పులు, వాపులు వంటివి కూడా దూరం అవుతాయి.ఇక లాస్ట్ బట్ నాట్ లిస్ట్ మిరియాలు.
వింటర్ సీజన్ మీ టీలో రెండు దంచిన మిరియాలు వేసి మరిగించి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
ముఖ్యంగా మిరియాలు( Pepper ) మన ఇమ్యూనిటీ పవర్ ను రెట్టింపు చేస్తాయి.అదే సమయంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి వాటిని తరిమి కొడతాయి.మిరియాల్లోని పైపరైన్ శరీరంలోని హానికర ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తాయి.
మరియు మిరియాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ ను కరిగించి గుండె ఆరోగ్యానికి అండగా కూడా నిలుస్తాయి.ఇకపోతే మిరియాలు, అల్లం( Ginger ), యాలకులు.
ఈ మూడిటిని రోజుకు ఒకటి చొప్పున టీలో యాడ్ చేసుకుని తీసుకోవచ్చు.లేదా మూడింటిని కలిపి కూడా వేసుకుని తీసుకోవచ్చు.