రానున్న పార్లమెంట్ ఎన్నికలను కమలం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.లోక్ సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లను గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది.
ఇందులో భాగంగానే తెలంగాణపై జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది.ఈ నేపథ్యంలో ఇవాళ, రేపు బీజేపీ నేతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు.
ఇవాళ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ తెలంగాణకు రానుండగా రేపు తరుణ్ చుగ్ రానున్నారని తెలుస్తోంది.రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం వేసిన కమిటీలతో సునీల్ బన్సల్ వరుస సమావేశాలు నిర్వహించనున్నారు.
రేపు బీజేపీ కోర్ కమిటీ సభ్యులతో తరుణ్ చుగ్ భేటీకానున్నారు.ఇందులో భాగంగానే లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
అయితే పార్టీ బలోపేతం కోసం బీజేపీ ఇప్పటికే పది కమిటీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.