రాజన్న సిరిసిల్ల జిల్లా: దివ్యాంగులకు అవసరమైన సహాయ ఉపకరణాల పంపిణీ శనివారం ఉదయం 11 గంటలకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించ నున్నారు.ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇతర ఎమ్మెల్యేలు, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరుకానున్నారు.
మొత్తం 675 పరికరాల కోసం ఇల్లంతకుంట, బోయినపల్లి, ఎల్లారెడ్డిపేట, చందుర్తి, వేములవాడలో గత ఆగస్టులో ప్రాథమిక పరీక్షలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు.బ్యాటరీ ఆపరేటడ్ ట్రై సైకిల్స్, వీల్ చైర్స్, వినికిడి పరికరాలు, సుగమ్య కేన్ అందుల కోసం, నడవరాని వారి కోసం శారీరక దివ్యాంగుల కోసం ఆక్సిలరీ క్రచేస్,ఎల్బో క్రేచేస్ పంపిణీ చేయనున్నారు.