రాజన్న సిరిసిల్ల జిల్లా :“పోరు కన్నా ఊరు మిన్న – మన ఊరుకి తిరిగి రండి“ అనే కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లా పోలీస్ కార్యాలయంలో మీటింగ్ / కౌన్సిలింగ్ సెషన్ ఏర్పాటు చేసి సరెండర్ అయిన నేరెళ్ళ జ్యోతి@ జ్యోతక్కతో సరెండర్ అయిన వారికీ ప్రభుత్వం అందించే పునరావాసం ఇతర సదుపాయాలు మొదలైన వాటి గురించి వివరించటం జరిగిందన్నారు.తనకు రావాల్సిన పెండింగ్ లో ఉన్న ఇతర సదుపాయాలను సంబంధిత అధికారులతో చర్చించి పరిస్కరిస్తాను అని హామీ ఇవ్వటం జరిగిందన్నారు.
అదే విధంగా తంగళ్ళపల్లి మండలం గోపాలరావుపల్లికి చెందిన యు జి కడారి సత్యనారాయణ కుటుంబ సభ్యులతో వారి ఊరులోని ఇంటి వద్ద కలిసి జిల్లా ఎస్పీ పండ్లు అందించి తమ కుటుంబ సభ్యుడు అయిన యు జి కడారి సత్యనారాయణ ఆలియాస్ కోస ఆలియాస్ సాడు సరెండర్ అయి జన జీవన స్రవంతి కలవటంలో వారి సహాయ సహకారాలు అందించాలని వారిలో స్ఫూర్తి నింపి ప్రభుత్వం అందించే పునరావాసం & ఇతర సదుపాయాలు మొదలైన వాటి గురించి వివరించటం జరిగిందని తెలిపారు.