ఉప్పు, మిరియాలు మరియు నిమ్మకాయతో ఆరోగ్య ప్రయోజనాలు

మిరియాలు, ఉప్పు మరియు నిమ్మకాయను కేవలం సలాడ్స్ లో ఉపయోగించటమే కాకుండా ఔషదంగా కూడా సహాయపడుతుంది.ప్రపంచవ్యాప్తంగా అనేక మంది కొన్ని రోగాల చికిత్సకు ఈ దినుసులను ఉపయోగిస్తున్నారు.

ఇవి ఖరీదు తక్కువగా ఉండటమే కాకుండా మనకు సులభంగా అందుబాటులో ఉంటాయి.ఇప్పుడు నల్ల మిరియాలు, నిమ్మకాయ మరియు సముద్ర ఉప్పు చికిత్సలో ఎలా సహయపడతాయో తెలుసుకుందాం.

1.గొంతు నొప్పి

ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నిమ్మరసం,అరస్పూన్ నల్ల మిరియాల పొడి,ఒక స్పూన్ సముద్ర ఉప్పు కలపాలి.ఈ మిశ్రమాన్ని రోజులో కొన్ని సార్లు పుక్కిలించి ఉమ్మివేస్తే గొంతు నొప్పి మరియు దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది.

2.ముక్కు దిబ్బడ

తుమ్ముల ద్వారా ముక్కు దిబ్బడ ఉపశమనం కలుగుతుంది.

నల్ల మిరియాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, యాలకులను సమాన మొత్తంలో తీసుకోని మెత్తగా పొడిగా చేయాలి.ఈ పొడిని నెమ్మదిగా పీల్చితే తుమ్ములు వచ్చి ముక్కు దిబ్బడ తగ్గుతుంది.

3.పిత్తాశయంలో రాళ్లను తొలగిస్తుంది

పిత్తాశయంలో రూపొందే జీర్ణ ద్రవాలు గట్టిపడి పిత్తాశయంలో రాళ్లు ఏర్పడతాయి.ఈ పరిస్థితి చాలా బాధకరంగాను మరియు జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది.

Advertisement

సాదారణంగా ఈ రాళ్ళను శస్త్రచికిత్స ద్వారా తొలగిస్తారు.కానీ సహజ నివారణల ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు.మూడు స్పూన్ల ఆలివ్ ఆయిల్, ఒక స్పూన్ నిమ్మరసం,ఒక స్పూన్ సముద్ర ఉప్పు,ఒక స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలిపి తీసుకోవాలి.

4.నోటిలో పొక్కులు

ఒక కప్పు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ సముద్ర ఉప్పు వేసి బాగా కలిపి నోటిలో పోసుకొని పుక్కిలించి ఉమ్మివేయాలి.ఈ పద్ధతి చెడు బాక్టీరియా తొలగించడానికి బాగా సహాయపడుతుంది.

5.బరువు తగ్గటానికి

ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో పావు స్పూన్ నల్ల మిరియాల పొడి,రెండు స్పూన్ల నిమ్మరసం,ఒక స్పూన్ తేనే కలిపి త్రాగితే జీవక్రియ వేగవంతం అవుతుంది.నిమ్మకాయలో పోలిఫెనోల్స్ అధికంగా ఉండుట వలన బరువు తగ్గటంలో సహాయపడుతుంది.

ఆ నటుడి భార్యకు ఫోన్ చేసి నటుడిని ఇరికించిన బాలయ్య.. బాలయ్యలో ఈ యాంగిల్ ఉందా?
Advertisement

తాజా వార్తలు