నిజ్జర్ హత్య కేసు : కెనడా పోలీసుల అదుపులో ముగ్గురు భారతీయులు

భారత్ – కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు కారణమైన ఖలిస్తానీ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ ( Hardeep Singh Nijjar )హత్య కేసుకు సంబంధించి ముగ్గురు అనుమానిత భారతీయులను శుక్రవారం కెనడా పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా మీడియా నివేదించింది.వీరిని కరణ్ ప్రీత్ సింగ్, కమల్ ప్రీత్ సింగ్, కరణ్ బ్రార్‌లుగా పేర్కొన్నారు.

 Canada Cops Arrest 3 Indians In Hardeep Singh Nijjar Murder Case ,canada, Lebla-TeluguStop.com

వీరిపై ఫస్ట్ డిగ్రీ హత్య, కుట్ర అభియోగాలు మోపినట్లుగా కోర్టు పత్రాలు చూపిస్తున్నాయని నివేదికలు తెలిపాయి.ఈ అనుమానితులు స్టూడెంట్ వీసాలపై కెనడాలోకి ప్రవేశించారని మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Telugu Indians, Canada, Canada Cops, Hardeepsingh, Karan Brar, Leblanc-Telugu NR

కెనడా పబ్లిక్ సేఫ్టీ మినిస్టర్ డొమినిక్ లెబ్లాంక్ ( LeBlanc )శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.అనుమానితులతో భారత ప్రభుత్వానికి వున్న సంబంధాన్ని ధృవీకరించడానికి నిరాకరించారు.దర్యాప్తుకు దగ్గరగా వున్న మూలాలను ఉటంకిస్తూ.ఎడ్మొంటన్‌లో 11 ఏళ్ల బాలుడిపై కాల్పులు జరపడంతో పాటు కెనడాలో జరిగిన మరో మూడు హత్యలపై దర్యాప్తును పోలీసులు వేగవంతం చేసినట్లుగా సీబీఎస్ న్యూస్ నివేదించింది.

Telugu Indians, Canada, Canada Cops, Hardeepsingh, Karan Brar, Leblanc-Telugu NR

గతేడాది జూన్ 18న ఖలిస్తాన్ హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు.హత్య జరిగిన రోజున హిట్ స్క్వాడ్ సభ్యులు షూటర్లు, డ్రైవర్లు, స్పాటర్లుగా విభిన్న పాత్రలు పోషించారని మీడియా పేర్కొంది.రెండు ప్రావిన్సుల్లో పోలీసులు జరిపిన స్పెషల్ ఆపరేషన్‌లో వీరిని అరెస్ట్ చేసినట్లు నివేదిక తెలిపింది.కాగా.హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ప్రమేయం వుండొచ్చంటూ గతేడాది ట్రూడో( Justin Trudeau ) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.దీనిని భారత్ తీవ్రంగా పరిగణించింది.

ఇప్పటికే ఇరుదేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించగా.కెనడాలోని వీసా ప్రాసెసింగ్ కేంద్రాన్ని భారత్ మూసివేసింది.

ఆ తర్వాత పౌర సమాజం నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు వీసా ప్రాసెసింగ్‌ను పునరుద్ధరించింది.ప్రస్తుతం ఇరుదేశాల మధ్య రాజీ కుదిర్చేందుకు అంతర్జాతీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube