రాజన్న సిరిసిల్ల జిల్లా: లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కోట సతీష్ కుమార్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్టడీ అవర్స్ లో విద్యార్థులకు అల్పాహారం అందించడం కోసం పదివేల రూపాయలను ఇన్చార్జి ప్రిన్సిపాల్ వాసర వేణి పరుశరాములు కు శుక్రవారం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రాబోయే ఇంటర్ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని కళాశాలకు, మండలానికి, తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వి.ఎన్.రావు, రీజనల్ చైర్ పర్సన్ పోతాని ప్రవీణ్, జోన్ చైర్ పర్సన్ మడుపు నవీన్ రెడ్డి, లయన్స్ క్లబ్ సెక్రటరీ నాయన భాస్కర్ రెడ్డి, ట్రెజరర్ రావుల లింగారెడ్డి, డిస్ట్రిక్ట్ చైర్ పర్సన్ పయ్యావుల రామచంద్రం, లయన్స్ క్లబ్ బాధ్యులు ముత్యాల శ్రీనివాస్ రెడ్డి, సద్ది లక్ష్మారెడ్డి, ముత్యాల కిష్టారెడ్డి, రావుల ముత్యంరెడ్డి, పల్లి సాంబశివరావు, పెంజర్ల రవి, మద్దివేని లక్ష్మణ్, కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.