రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల విద్యాధికారి కార్యాలయంలో ప్రోగ్రెస్ రికగ్నైట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ పిఆర్టియు కాలమానిని మండల విద్యాధికారి జి కృష్ణ హరి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను అన్ని రంగాల్లో ఉన్నతులుగా తీర్చిదిద్దాలని మన మండలాన్ని 10వ తరగతి ఫలితాల్లో జిల్లాలో మొదటి స్థానంలో నిలపాలని, నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పిఆర్టియు మండల అధ్యక్షులు గరుగుల కృష్ణ హరి,ప్రధాన కార్యదర్శి బొల్లి భగవాన్,రాష్ట్ర కార్యదర్శి షఫీ,జిల్లా కార్యదర్శి తేళ్ల పూర్ణచందర్,మహిళా ఉపాధ్యక్షురాలు పులి కల్పన, వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.