రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రముఖ సంఘసంస్కర్త, ఈ దేశంలో మొట్టమొదటి మహిళా పాఠశాల తో పాటు అనేక విద్యాసంస్థలను స్థాపించి మహిళల అభ్యున్నతికి కృషి చేసిన సామాజిక ఉద్యమకారిని, భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు కీ.శే.సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.
పాఠశాల విద్యార్థినీలు సావిత్రిబాయి పూలే వేషధారణలో, పాఠశాలకు విచ్చేసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలదండ ద్వారా ఘనంగా నివాళులర్పిస్తూ, సావిత్రిబాయి సేవలను గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాలలోని మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.మహిళా ఉపాధ్యాయులు మాట్లాడుతూ తాము ఈరోజు ఇలా ఉన్నత స్థితిలో ఉండడానికి కారణమైన సావిత్రిబాయి పూలే సేవలను కొనియాడారు.
విద్యార్థులు జ్యోతిబాపూలే సావిత్రిబాయి పూలే గారిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమం లో పాఠశాలలో ఉపాధ్యాయ బృందం టేకుమల్ల శ్రీకాంత్, వెలిశాల సౌజన్య,నదియా,లాస్య, తదితరులు పాల్గొన్నారు.