నిత్యం యోగా సాధనతో ఆరోగ్యంపై పట్టుసాధించవచ్చు : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా: నిరంతరం విధులు నిర్వహించే పోలీసులు నిత్యం యోగా సాధనతో తమ ఆరోగ్యంపై పట్టుసాధించవచ్చని, నిత్యజీవితంలో యోగ ఒక అలవాటుగా మార్చుకోవాలని జిల్లా ఎస్పీ అధికారులకు, సిబ్బందికి పిలుపునిచ్చారు.శనివారం రోజున ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద యోగా కార్యాక్రమాన్ని నిర్వహించి యోగా నిపుణులచే పోలీస్ అధికారులకు,సిబ్బందికి యోగాలో శిక్షణనిచ్చారు.

 Health Can Be Maintained By Practicing Yoga Regularly District Sp Akhil Mahajan,-TeluguStop.com

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడు విధినిర్వహణలో ఉండటం వలన తమ ఆరోగ్యం పట్టించుకోకపోవడంతో ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని ఆరోగ్యంపై అవగాహన ఎంతో ముఖ్యమని,సిబ్బంది, అధికారులు ఆరోగ్యం పట్ల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు దినచర్య,

జీవన విధానం మిగతావారితో పూర్తి భిన్నంగా ఉంటుందని, ఇందుకుగానూ మన ఆరోగ్య పరిరక్షణకై ప్రత్యేక చర్యలు తీసుకొనక తప్పదని అన్నారు.ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నడక, వ్యాయామం,యోగ వంటివి మన దినచర్యలో భాగం చేసుకోవాలని.

ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాధులు ఎంతో వేగంగా విస్తరిస్తున్నాయని వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తగిన ఆరోగ్య సూచనలు పాటిస్తే ఎంతో మంచిదని అన్నారు.ఈ కార్యక్రమములో అదనపు ఎస్పీ చంద్రయ్య,డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్.ఐ లు మధుకర్, రమేష్, సి.ఐ లు మొగిలి,మధుకర్, శ్రీనివాస్, ఎస్.ఐ లు ఆర్.ఎస్.ఐ లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube