రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణలోని గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనది.5న తరగతితో పాటు 6 నుంచి 9 వరకు తరగతుల్లో ఖాళీ సీట్లకు దరఖాస్తులు చేసుకోవాలని వరంగల్, కరీంనగర్ ప్రాంతీయ సమన్వయ అధికారి డి.ఎస్.వెంకన్న, మానాల గిరిజన గురుకుల కళాశాల/పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు.
దరఖాస్తు ప్రక్రియలో ఈ సంవత్సరం కొన్ని మార్పులు చేశామన్నారు.దరఖాస్తు సమయంలోనే అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు.ఇందుకు స్టడీ, ఆధార్ కార్డు, కులం, ఆదాయ ధ్రువపత్రాలు తీసుకోవాలని సూచించారు.