రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను అభివృద్ధి పరచాలని ఈ పాఠశాల రిటైర్డ్ హిందీ టీచర్ వాసాలమర్రి విట్టల్ సారు సూచించారు.వేములవాడ భీమేశ్వర వీధిలోని బాలాంబిక సాధనములో జరిగిన 1974 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
గత 70 సంవత్సరాలు నుండి ఇక్కడ హైస్కూల్ దాదాపు 50 గ్రామాలకు చెందిన వేలాది మంది విద్యార్థులకు విద్యా బోధన సౌకర్యము కల్పించిందని ఆయన అన్నారు.ప్రస్తుతము ఉన్న హైస్కూల్లో క్రీడాస్థలము వసతి స్థలము సరిగాలేదని ఆయన అన్నారు.
హైస్కూల్ భవనాలను విడదీసి,1980 ప్రాంతాల్లో సగం వరకు విడదీసి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఇచ్చారని, దీనివల్ల పాఠశాలకు అసౌకర్యాలు ఏర్పడ్డాయని అన్నారు.జూనియర్ కళాశాలకు కమాన్ రోడ్ లో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించారని సంబంధించిన ప్రభుత్వ నిధులు బ్యాంకులో డిపాజిట్ గా ఉన్నాయని ఆయన అన్నారు.జూనియర్ కళాశాలను అక్కడికి మార్చి ఈ స్థలాన్ని హైస్కూల్ కు అప్పగించాలని కోరారు.1984 ఎస్ఎస్సి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి 50 మంది వరకు హాజరయ్యారు.అప్పటి గురువులు రిటైర్డ్ టీచర్లు వాసాల మర్రి విట్టల్, రిటైర్డ్ ఎంఈఓ దేవేంద్రం, రిటైర్డ్ హిందీ పండిట్ కామారపు సాంబశివరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
పూర్వ విద్యార్థులు ఈ ముగ్గురు టీచర్లను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.50 ఏళ్ల గ్యాప్ అనంతరము ఈ విద్యార్థులు హైస్కూల్ ప్రాంగణానికి వెళ్లి ఫోటోలు దిగారు.పూర్వ విద్యార్థుల పక్షాన ఉపాధ్యాయుల సాంబశివుడు, డాక్టర్ పోలాస రమేష్, డాక్టర్ కేశన్నగారి అశోక్ -డాక్టర్ శ్రీదేవి, శ్రీమతి పెద్దిశోభ, శ్రీమతి ధనలక్ష్మి, శ్రీమతి రాగంపేట సామ్రాజ్యం, డా.శ్రీనివాస్, వేదాంతం ఉదయశ్రీ, వేములవాడ సింగిల్ విండో వైస్ చైర్మన్ తూమ్ లక్ష్మికాంతారావు, బుట్టా శంకర్, చింతలపల్లి రాజిరెడ్డి, రిటైడ్ పౌర సంబంధాల అధికారి బైరి పూర్ణచందర్, శైలజ, ఎల్ఐసి ఏజెంట్ లక్ష్మీ, నాంపల్లి సింగిల్ విండో చైర్మన్ బి.సల్మాన్ రెడ్డి, రిటైర్డ్ ఎస్సై స, మాదాసు మల్లేశం, సయ్యద్ సాబీర్, తుమ్మ బాల శౌరిరెడ్డి, ప్రముఖ వర్తకులు తమ్మిశెట్టి అశోక్, పుల్లూరు విశ్వనాథం, ఎల్లాల లక్ష్మారెడ్డి దంపతులు, శ్రీమతి కౌసల్య, కమలగారి శ్రీనివాస్, బివి శర్మ, రామతీర్థపు లక్ష్మీరాజ్యం, హిస్టోరియన్ సంకేపల్లి నాగేంద్రశర్మ, తదితరులు పాల్గొన్నారు.