రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో సిఐటియు, గ్రామపంచాయతీ కార్మికుల ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కి శుక్రవారం రోజున ఘనంగా నివాళులర్పించడం జరిగింది.ఈ సందర్భంగా మండల సిఐటియు కన్వీనర్ గురిజాల శ్రీధర్ మాట్లాడుతూ 2004 నుంచి 2014 వరకు భారతదేశానికి ఎన్నో సేవలు అందించిన ఘనత, అలాగే ఆర్థిక సంస్కరణల విషయంలో ముందుకు తీసుకెల్లిన ఘనత మన్మోహన్ సింగ్ కి దక్కుతుందని,అలాగే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ విషయంలో తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలబడి, తెలంగాణ రావడానికి కీలక పాత్ర పోషించినటువంటి చరిత్ర అని ప్రధాని మన్మోహన్ సింగ్ కి దక్కుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికులు అక్కనపల్లి లచ్చయ్య, కొండవీని నాగరాజు, కత్తెరపాక నరేష్, కురుమ సంజీవ్, కత్తెరపాక వెంకటేష్, దాసరి బాబు, కుడుకల పరశురాం, మిగతా గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామాల వారిగా కార్మికులు పాల్గొన్నారు.