పూరైన గాంధీ చిత్ర ఉచిత ప్రదర్శన..తొమ్మిదు రోజులలో గాంధీ చిత్రాన్ని చూసిన 14,930 మంది విద్యార్థులు

గాంధీ చిత్రాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla )లో 14,930 మంది విద్యార్థిని విద్యార్థులు థియేటర్ లలో వీక్షించారు.విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాన్ని పెంపొందించేందుకు, గాంధీ గొప్పతనాన్ని నేటి తరానికి తెలియజేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు వారి తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించారు.

 Free Screening Of Full Gandhi Movie..14,930 Students Watched Gandhi Movie In Nin-TeluguStop.com

ఈ చిత్రాన్ని ఈనెల 14 నుంచి ఉచితంగా ప్రదర్శించారు.తొలి రోజు 1,767 మంది విద్యార్థులు, వారితల్లిదండ్రులు వీక్షించారు.

ఈనెల 15 గా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్ర ప్రదర్శనకు విరామం ఇచ్చారు.
కాగా ఈనెల 16న చిత్ర ప్రదర్శనను తిరప్రారంభించారు.

ఈ నెల 16న 1864 మంది, 17వ తేదీన 2019 మంది,18వ తేదీన 1931 మంది,19వ తేదీన 1382 మంది చిత్రాన్ని వీక్షించారు.ఈ నెల 20న ఆదివారం సందర్బంగా చిత్ర ప్రదర్శనకు విరామం ఇచ్చారు.మరల 21వ తేదీన చిత్ర ప్రదర్శనను తిరిగి ప్రారంభించారు.21వ తేదీన 1508 మంది, 22వ తేదీన 1941 మంది, 23వ తేదీన 1149 మంది చివరి రోజున 1369 మంది విద్యార్థులు చిత్రాన్ని వీక్షించారు.గురువారం జిల్లా విద్యాధికారి ఏ రమేష్ కుమార్, జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం విద్యార్థులతో కలిసి చిత్రాన్ని నటరాజ్ థియేటర్ లో వీక్షించారు.కాగా ఈ చిత్ర ప్రదర్శన గురువారంతో జిల్లాలోని అన్ని థియేటర్ లలో ముగించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube