కార్యదర్శుల సమ్మెకు సంఘీభావం తెలిపిన బిజెపి నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలో గత ఆరు రోజులుగా నిరావదికంగా సమ్మె చేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్యదర్శులు, జూనియర్ పంచాయతీ కార్యదర్శులును బుధవారం భారతీయ జనతా పార్టీ మండల నాయకులు కలిసి వారికి భాజపా పక్షాన సంఘీభావం తెలపడం జరిగింది.ఈ సందర్భంగా భాజపా జిల్లా ఉపాధ్యక్షులు గుండాడి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మెకు భాజపా పూర్తిగా మద్దతునిస్తుందని, ఔట్ సోర్సింగ్ జూనియర్ కార్యదర్శుల సమస్యలను తెలంగాణ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని, గ్రామపంచాయతీ కార్యదర్శులు గ్రామ అభివృద్ధికి పాటుపడుతూ, గ్రామ ప్రజలతో మమేకమై విధులను నిర్వర్తిస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 Bjp Leaders Support Junior And Out Sourcing Panchayat Secretaries Strike, Bjp Le-TeluguStop.com

గ్రామ కార్యదర్శులను మూడు సంవత్సరాలకు రెగ్యులర్ చేస్తామని విధుల్లోకి తీసుకొని నాలుగు సంవత్సరాలు గడిచిన వారిని రెగ్యులర్ చేయకపోవడం బాధాకరమని, ప్రభుత్వ అసమర్థత అని అన్నారు.వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమ్మె చేస్తున్న పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించాలని లేనియెడల భాజపా పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి బంధారపు లక్ష్మారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సందుపట్ల లక్ష్మారెడ్డి, వీర్నపల్లి మండల అధ్యక్షులు గునుకుల దేవేందర్ రెడ్డి, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు కోనేటి సాయిలు, జిల్లా బీజేవైఎం కార్యదర్శి దుస శ్రీనివాస్, కంచర్ల పర్శరాములు, వంగ శ్రీకాంత్ రెడ్డి, అనిల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube