రాజన్న సిరిసిల్ల జిల్లాలో నకిలీ గల్ఫ్ ఏజెంట్ల పై పోలీసులు కొరడా..

జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో దాడులు , 03 కేసులు నమోదు.నకిలీ వీసాలు ఇచ్చి విదేశాల్లో ఉద్యోగాల కోసం,ఉపాధి కోసం వెళ్ళే వారిని మోసం చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం.

 Police Crack Down On Fake Gulf Agents In Rajanna Sirisilla District , Dsp Chandr-TeluguStop.com

జిల్లాలో ఈ సంవత్సరం 19 కేసులలో నకిలీ ఏజెంట్లను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది.విదేశాల్లో ఉద్యోగాల కోసం , ఉపాధి కోసం వెల్లేవారు నకిలి ఏజెంట్లను ఆశ్రయించి మోసపోవద్దు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేకుండా మోసాలకు పాల్పడుతున్న నకిలీ గల్ఫ్ ఏజెంట్లపై శనివారం సాయంత్రం సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా టీమ్ లాగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 03 కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.

నకిలీ వీసాలు ఇచ్చి విదేశాల్లో ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం వెళ్ళే వారిని మోసం చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని ఈసందర్భంగా జిల్లా ఎస్పీ హెచ్చరించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నకిలీ గల్ఫ్ ఎజెంట్స్ విజిట్ వీసాల పై జిల్లాలో ఉన్న నిరుద్యోగులని టార్గెట్ చేసి వారి నుండి అధిక మొత్తంలో డబ్బులు తీసుకొని మాయ మాటలు చెప్పి ఇక్కడి నుండి గల్ఫ్ దేశాలకి పంపిస్తున్నారని అన్నారు.

అక్కడికి అప్పులు చేసి వెళ్లిన తరువాత కంపనీ వీసా కాదని తెలిసి దేశం కానీ దేశంలో ఎం చేయాలో తెలియక అష్ట కష్టాలు పడి స్వదేశానికి తిరుగు ప్రయాణం అవడం లేదా అక్కడే ఏదో చిన్న చితక కూలి పని చేసుకోవడం వంటివి జరుగుతున్నాయని,అయితే ఎవరైతే ఏజెన్సీల లేదా ఏజెంట్ల చేతిలో మోసపోయారో వారు నేరుగా పోలీసులకు పిర్యాదు చేస్తే ఆ పిర్యాదు పై తగిన రీతిలో విచారణ జరిపి నేరం రుజువు అయితే సదరు ఏజెంట్ పై కేసు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు.జిల్లాలో గత సంవత్సరం 43 కేసులు ,ఈ సంవత్సరం 19 కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.

నకిలీ వీసాలు ఇచ్చి విదేశాల్లో ఉద్యోగాల కోసం,ఉపాధి కోసం వెళ్ళే వారిని మోసం చేస్తే సదరు ఏజెన్సీల రద్దు కు సిఫారసు చేయడం తో పాటు వారి ఫై పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుందన్నారు.విదేశాల్లో ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం వెల్లేవారు నకిలి ఏజెంట్లను ఆశ్రయించి మోసపోవద్దని, జిల్లాలో ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్ళు వారు లైసెన్స్ కలిగి ఉన్న ఏజెంట్లను మాత్రమే ఆశ్రయించి, వారి ద్వారానే వీసాలు పొందవలసిందిగా సూచించారు.

గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు లైసెన్స్ గల ఏజెంట్ల వివరాలు తెలుసుకొనుటకు గాను పోలీస్ శాఖ వారిని సంప్రదించవచ్చని సూచించారు.జిల్లాలో నకిలీ గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయిన, విదేశాలకు పంపిస్తా అని డబ్బులు తీసుకొని , పాస్పోర్ట్ తీసుకోని పంపకుండా మోసం చేసిన , నకిలీ గల్ఫ్ ఏజెంట్ల కి సంబంధించిన సమాచారం ఉంటే సమాచారం అందించాలని ఎస్పీ కోరారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube