పెదాలు వారం రోజుల్లో గులాబీ రంగులోకి మారాలంటే ఇలా చేయండి!

గులాబీ రంగులో మెరుస్తూ ఉండే పెదాలు అందాన్ని మరింత రెట్టింపు చేస్తాయి.అందులో ఎటువంటి సందేహం లేదు.

 If You Use This Lip Balm, Your Lips Will Turn Pink In A Week , Lip Balm, Lips, P-TeluguStop.com

అలాగే ముఖాన్ని ఆక‌ర్ష‌ణీయంగా కూడా మారుస్తాయి.అందుకే పెదాలు కాస్త నల్ల‌గా మారిన తీవ్రంగా ఆందోళన చెందుతుంటారు.

ఈ క్రమంలోనే పెదాల నలుపును వదిలించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉంటే అస్సలు చింతించకండి.

ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని ట్రై చేస్తే వారం రోజుల్లో నల్లగా మారిన పెదాలను గులాబీ రంగులోకి మార్చుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటి.? దాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు చూద్దాం.ముందుగా ఒక చిన్న బీట్ రూట్ ను తీసుకునిపీల్ తొల‌గించి నీటిలో శుభ్రంగా కడగాలి.

ఇలా కడిగిన బీట్ రూట్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్‌ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ షియా బటర్, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్‌ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, మూడు టేబుల్ స్పూన్లు బీట్ రూట్ జ్యూస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Tips, Lips, Latest, Lip Balm, Lip Care-Telugu Health Tips

ఇప్పుడు ఈ గిన్నెను మరుగుతున్న నీటిలో కనీసం ప‌ది నిమిషాల పాటు ఉంచాలి.అనంతరం ఈ మిశ్రమాన్ని ఒక బాక్స్ లో నింపుకొని రెండు గంటల పాటు వదిలేస్తే మంచి లిప్ బామ్ తయారవుతుంది.రోజుకు మూడు, నాలుగు సార్లు ఈ లిప్ బామ్‌ను ఉపయోగిస్తూ ఉండాలి.

ఇలా చేస్తే వారం రోజుల్లో నల్లని పెదాలు గులాబీ రంగులోకి మారతాయి.మరియు పెదాలు మృదువుగా కోమలంగా సైతం మారతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube