సూర్యాపేట జిల్లా:ఎర్రజెండా కోసం దేశ వ్యాప్తంగా తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన లక్షలాది అమర వీరుల త్యాగ ఫలితమే ఈనాడు జరుపుకుంటున్న భారత కమ్యునిస్టు పార్టీ (సిపిఐ) శతాబ్ది వేడుకలను సిపిఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు అన్నారు.శుక్రవారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రంగాపురం గ్రామంలో సిపిఐ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో రంగాపురం గ్రామం చాలా కీలకమైన పాత్ర పోషించిందని, పోటు యర్రమ్మ,రాఘవయ్య అజ్ఞాత జీవితం గడిపారని, తెలంగాణ సాయుధ పోరాట పుస్తకాల్లో కూడా రంగాపురం చరిత్ర నిక్షిప్తమై ఉందన్నారు.1925 డిసెంబర్ 26న ఉదయించిన భారత కమ్యూనిస్టు పార్టీ నాటి నుండి నేటి వరకు లక్షలాది మంది వీరుల త్యాగాలు చేసి నిస్వార్ధంగా ప్రజల పక్షాన నిలిచి పోరాటాలు నిర్వహించిందని గుర్తు చేశారు.ఈ సందర్భంగా ప్రతీ గ్రామంలో సిపిఐ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించాలని పార్టీ శ్రేణులను కోరారు.ఈనెల 30వ తారీఖున నల్గొండలో జరిగే సిపిఐ వంద సంవత్సరాల వేడుకలకు ప్రతీ గ్రామం నుండి అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ గ్రామ కార్యదర్శి తిరగమల్ల కిరణ్,కట్ట అశోక్,ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి మెండే లింగరాజు, బాలశౌరి,సతీష్,నవీన్,రాయప్ప,నాగులు,రాజశేఖర్,వీరబాబు,యల్లయ్య,బాబు,కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.