సూర్యాపేట జిల్లా: నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో గత నెలలో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేశారు.సీసీ రోడ్డు పోసిన మూడు రోజుల నుండే రోడ్డు పగుళ్లు వచ్చాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా సిమెంటు,కంకర తక్కువ వాడుతూ పౌడర్ ఎక్కువ వాడడం,
వాటర్ క్యురింగ్ చేయకపోవడం వల్ల పగుళ్లు వచ్చాయని ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉంటే సీసీ రోడ్డుకు ఇరువైపులా మట్టి పోయకపోవడంతో ట్రాక్టర్లు, ఆటోలు రోడ్డుపైకి ఎక్కుతుంటేనే పగుళ్లు ఏర్పడుతున్నాయని అంటున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి నాణ్యత లేని రోడ్లు పోసిన కాంట్రాక్టర్ పై,పర్యవేక్షణ చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.