సూర్యాపేట జిల్లా:అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు ప్రభుత్వం 24 ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెబుతున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం రైతులు విద్యుత్ అధికారుల తీరుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిలువెత్తు నిదర్శనమే ఎర్రపాడు ఘటన.ఇది ఎక్కడో కాదు, సాక్షాత్తు విద్యుత్ మంత్రి జిల్లాలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మిర్చి పంటలు ఎండిపోయి,రైతులు లక్షల్లో నష్టాల బారిన పడడంతో ట్రాన్స్ఫార్మర్ రూపంలో రైతుల తలపై పిడుగు పడిందని చెప్పవచ్చు.
ఈ సంఘటన జిల్లాలో సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది.వివరాల్లోకి వెళితే తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని ఎర్రపాడు గ్రామంలో అధికార పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ లింగాల రాములు సుమారు రెండు ఎకరాల మిరప తోట వేశారు.
గత 15 రోజుల క్రితం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో స్థానిక లైన్ మెన్ దృష్టికి తీసుకెళ్లారు.అయినా పట్టించుకోక పోవడంతో రైతులే సొంత ఖర్చులతో ట్రాన్స్ఫార్మర్ సూర్యాపేటకు తీసుకెళ్లి రిపేర్ చేయించుకున్నారు.
అయినా విద్యుత్ అధికారులు వచ్చి ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మిర్చి తోట పూర్తిగా ఎందిపోయిందని అధికార పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ లింగాల రాములు కన్నీటి పర్యంతమయ్యారు.ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఫలితం లేదన్నారు.
లింగాల రాములుతో పాటు ఇదే ట్రాన్స్ఫార్మర్ కింద మరికొంత రైతులు సుమారు నాలుగు ఎకరాలలో మిర్చి పంటను సాగు చేశారని అందరి పరిస్థితి ఇలాగే ఉందని యువ రైతు విజయ్ తెలిపారు.మిర్చి పంట మంచిగా వస్తే చేసిన అప్పులు తీరుతాయని భావించామని,విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొలుకోకుండా అయ్యామని,ఒక్కొక్క రైతు రెండు లక్షలు పైగా పెట్టుబడి పెట్టామని,సకాలంలో ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేసి నీళ్ళు అంది ఉంటే ఒక్కొక్క రైతుకు 5 లక్షల వరకు ఆదాయం వచ్చేదని,ఇప్పుడు తమను ఎవరు ఆదుకుంటారని ఆవేదన అవేదన వ్యక్తం చేస్తూ,తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
ఎండిపోయిన మిరప తోట దగ్గరకు వెళ