విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

సూర్యాపేట జిల్లా: ప్రభుత్వ పాఠశాలలో గుణాత్మక విద్యానందించాలని రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి కోమిటరెడ్డి వెంకట రెడ్డి అన్నారు.శనివారం సూర్యాపేట జిల్లా నూతనకల్ జెడ్పి హైస్కూల్ లో ఏర్పాటు చేసిన ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కసి పాల్గొన్నారు.

 Initiative For Revolutionary Changes In Education System Minister Komati Reddy V-TeluguStop.com

ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని,ప్రతి పాఠశాలలో విద్యార్థులకు గుణాత్మక విద్యానందించ నున్నట్లు పేర్కొన్నారు.ప్రభుత్వం విద్యా వ్యవస్థ బలోపేతానికి రూ.22 వేల కోట్లు కేటాయించిందని, పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 6 వేల పాఠశాలలు మూసివేయడం జరిగిందని అన్నారు.

దశల వారిగా రూ.600 కోట్లతో అన్ని పాఠశాలను మోడల్ స్కూల్స్ గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.రాష్ట్రంలో అభయ హస్తంలో ఉన్న అన్ని పథకాలు అర్హులందరికీ అందిస్తామని,అలాగే రూ.2 లక్షల రైతు రుణమాఫీ ఆగస్టు 15 నాటికి చెల్లిస్తామని స్పష్టం చేశారు.పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కార్పోరేట్ స్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించి పిల్లలకు బంగారు భవిష్యత్ కల్పించాలని సూచించారు.ఇందిరమ్మ ఇండ్లను నియోజకవర్గాల వారీగా పేదలైన అర్హులకు నిర్మించి ఇస్తామని, తుంగతుర్తి నియోజకవర్గంలో పాత రోడ్లకు రూ.75 కోట్లతో మరమ్మతులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయడం జరిగిందని,అలాగే రెండు సంవత్సరాల్లో కొత్త రోడ్ల నిర్మాణం చెప్పట్టనున్నట్లు తెలిపారు.

అదే విధంగా ఈ ప్రాంతానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా లిఫ్టులు చేపట్టి వ్యవసాయ రంగానికి సాగునీరు అందించి ఈ ప్రాంత అభివృద్ధికి అధిక ప్రాధాన్యత కల్పిస్తామని అన్నారు.నూతనకల్ పాఠశాలకు 10 కంప్యూటర్లు,మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.10 లక్షలు అందించనున్నట్లు తెలిపారు.భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, విద్యార్థులు ఇష్టంతో చదివేలా నాణ్యమైన విద్యానందించాలన్నారు.జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ మాట్లాడుతూ జిల్లాలో గుర్తించిన 536 అమ్మ ఆదర్శ పాఠశాలలో 336 గుర్తించిన పనులను పూర్తి చేయడం జరిగిందని,

మిగిలిన పాఠశాలలో పనులు పురోగతిలో ఉన్నాయని,ప్రభుత్వ లక్ష్య దిశగా పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించామన్నారు.బడిబాట కార్యక్రమంలో భాగంగా పిల్లలకు ఏకరూప దుస్తులు,పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు మంత్రి చేతుల మీదుగా అందచేశారు.

ముందుగా విద్యార్థులు చేసిన నృత్యాలను మంత్రి,ఎంపి, జిల్లా కలెక్టర్ తో కలసి తిలకించి అభినందించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సి.హెచ్.ప్రియాంక, పిడి మధుసూదనరాజు, డిఈఓ అశోక్,డిపిఓ సురేష్ కుమార్,ఆర్ అండ్ బి ఈఈ భాస్కర్ రావు, డిడబ్ల్యూఓ వెంకటరమణ, ఎంపీపీ కళావతి,జడ్పీటీసీ కె.దామోదర్ రెడ్డి, తహసీల్దార్,ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube