సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న సమస్యలను యుద్ద ప్రాతిపదికన పరిష్కరించాలని సిపిఐ(ఎంఎల్) ప్రజాపంథా పార్టీ జిల్లా కన్వీనర్ కొత్తపల్లి శివకుమార్ డిమాండ్ చేశారు.ఆరోగ్య కేంద్రంలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఐ(ఏంఎల్)ప్రజాపంథా ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శిస్తే హాస్పిటల్ మొత్తం పేషెంట్స్ లేక వెలవెలపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.హాస్పిటల్ పరిసరాలు మొత్తం అపరిశుభ్రంగా మారి పందులు,కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయన్నారు.
దీనివల్ల హాస్పిటల్ కు వచ్చే పేషెంట్లు,స్టాప్,డాక్టర్లు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.హాస్పిటల్లో స్వీపర్లు లేక హాస్పటల్ మొత్తం కూడా దుమ్ము ధూళితో నిండి, టాయిలెట్స్ అపరిశుభ్రంగా తయారయ్యాయని, దీనివల్ల హాస్పిటల్ సిబ్బంది మరియు డాక్టర్లు సకాలానికి రాక పేషెంట్లు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.
హాస్పిటల్ కు మొత్తానికి ఒకే వెహికల్ ఉండటంవల్ల ఆరు మండలాల్లోని పేషెంట్లను తీసుకురావడం ఇబ్బందవుతుందని అన్నారు.తక్షణమే మండలానికి ఒక వెహికల్ ఏర్పాటు చేసి హాస్పిటల్లో ఉన్న సమస్యలను పరిష్కరించి హాస్పిటల్ సిబ్బందిని పెంచి డాక్టర్లకు అనుకూల పరిస్థితులు కల్పించి,యుద్ధ ప్రాతిపదికన హాస్పిటల్ ని 100 పడకల హాస్పిటల్ గా మార్చాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ హాస్పిటల్ ని కార్పొరేట్ హాస్పిటల్ గా మార్చి పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తానని చెప్పారని,కానీ,ఏ ప్రభుత్వ ఆస్పిటల్ చూసినా పేషెంట్ రావడానికి భయపడుతున్నారని,ముఖ్యంగా రూరల్ ఏరియాలో ఈ ఇబ్బందులు అధికంగా ఉన్నాయని అన్నారు.ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు సంబంధిత అధికారులు కల్పించుకొని హాస్పిటల్ లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
లేనియెడల పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో తుంగతుర్తి ప్రజాపంథా డివిజన్ కన్వీనర్ దొందమల రామన్న,పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, సంతోషి,సూరం రేణుక,పద్మ,జయమ్మ,దేవి, పి.
డి.ఎస్.యు అధ్యక్షకార్యదర్శులు ఎర్ర అఖిల్, పుల్లూరి సింహాద్రి,దుర్గన్న,వీరన్న,శోభన్ తదితరులు పాల్గొన్నారు.