యాదాద్రి జిల్లా:ముఖ్యమంత్రి కేసీఆర్,ప్రధానమంత్రి మోదీ హైదరాబాద్ ని భాగ్యనగరంగా పేరు మారుస్తామన్నారని,అహ్మదాబాద్ ని అదాని బాద్ గా మార్చుకోమని అంటున్న కేటీఆర్ మరి తెలంగాణలో మీరు చేస్తుంది ఏంటో చెప్పాలని టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్,భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు.బొమ్మలరామారం మండలం రామలింగంపల్లి గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ 36వ,వర్ధంతి వేడుకలకు ఆయన ముఖ్యాతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గ్రామంలో నెలకొల్పిన బాబూ జగ్జీవన్ రామ్ మరియు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాలను ఎంపీ ఆవిష్కరించి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం వాటర్ ఫిల్టర్ ప్లాంట్ మరియు కుట్టు మిషన్ల కేంద్రాలను ప్రారంభించారు.
గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన ఆయన పాఠశాలలో పిల్లల బాగోగులను అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వం ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాల పంపిణీ చెయ్యలేదని,వారికి తన సొంత ఖర్చులతో పాఠ్య పుస్తకాలను పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు.
గ్రామానికి వచ్చిన ఎంపీకి గ్రామప్రజలు ఘనస్వాగతం పలికారు.అనంతరం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడాతూ కేటీఆర్ అహ్మదాబాద్ ని అదాని బాద్ గా మార్చుకోమని అంటున్నారు.
మోదీని అహ్మదాబాద్ ను అదానిబాద్ గా మార్చుకోమంటున్న కేటీఆర్,మీరు కూడా హైదరాబాద్ ను భాగ్యనగరంగా మార్చాలని చూస్తున్నారు కదా అని ఎద్దేవా చేశారు.మీరు అదాని కంపెనీతో కలిసి మీ బంధువు ప్రతిభా శ్రీనివాసరావుకి 60 వేల కోట్లకు కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారని,మీరు సింగరేణిలో చేస్తున్నది ఏమిటని, సింగరేణిలోని గోల్డ్ మైన్ గురించి ఏం చెపుతారని ఫైర్ అయ్యారు.
ఒరిస్సాలో కేంద్ర ప్రభుత్వం గోల్డ్ ఇండియాను 20 వేల కోట్లకు మనకు ఇచ్చిందని,40 వేల కోట్లలో చెరి 20వేల కోట్లు కమిషన్ మాట్లాడుకున్నారని,దీనిపై తాను కోర్టుని ఆశ్రయించి ఆ ప్రక్రియను నిలిపివేసేందుకు ప్రయత్నం చేశానని గుర్తు చేశారు.ప్రధానమంత్రితో పాటు సీఐడీని కూడా కలిసి ఇక్కడి పరిస్థితిని వివరించానని తెలిపారు.మీరిద్దరూ దోచిపెట్టేది అదానిలకేనని,దానికి సాక్ష్యం నేనేన్నారు.20 వేల కోట్లకు చేయటానికి కాంట్రాక్టర్ సిద్ధంగా ఉన్నాక మీ స్వార్థం కోసం 60 వేల కోట్లకు ఇస్తూ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు.సుప్రీంకోర్టు వరకైనా వెళ్లి ఆ కాంట్రాక్టును నిలిపివేసి, 40 వేల కోట్ల ప్రజాధనాన్ని కాపాడుతానని అన్నారు.పార్లమెంట్ లోన గళం విప్పి ఈ అవినీతి అడ్డుకుంటానన్నారు.







