తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) రెండో రోజు బస్సు యాత్ర సూర్యాపేటలో( Suryapet ) కొనసాగుతోంది.ఈ మేరకు అర్వపల్లి, తిరుమలగిరి, జనగాం, ఆలేరు మీదుగా కేసీఆర్ యాత్ర భువనగిరికి చేరుకోనుంది.
భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ కు( Kyama Mallesh ) మద్ధతుగా కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు.అనంతరం భువనగిరిలో ఏర్పాటు చేయనున్న కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్నారు.
కాగా వచ్చే నెల 10వ తేదీ వరకు కేసీఆర్ బస్సు యాత్ర( KCR Bus Yatra ) కొనసాగనుంది.మిర్యాలగూడలో ప్రారంభమైన ఈ యాత్ర సిద్ధిపేటలో జరిగే భారీ బహిరంగ సభతో ముగియనుంది.
అయితే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకటి లేదా రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేసీఆర్ రోడ్ షోలు ఉండే విధంగా యాత్రను ప్లాన్ చేస్తున్నారు.కేసీఆర్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశారు.