చరణ్ కు సినిమా హిట్ అయిన రాని సంతోషం అది సక్సెస్ అయితే వస్తుందా?

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) వారసుడిగా రాంచరణ్( Ram Charan ) చిరుత సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి చరణ్ నటన పరంగా స్థలాన్ని తాను నిరూపించుకుంటూ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు.ఇలా గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నటువంటి రామ్ చరణ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ సినీ కెరియర్లో తండ్రికి మించిన తనయుడు అనే పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.

 Ram Charan Feels Very Happy To Success Than Movies Details, , Ram Charan, Busine-TeluguStop.com
Telugu Chiranjeevi, Panindia, Pawan Kalyan, Ram Charan, Upasana-Movie

ఇకపోతే తాజాగా రామ్ చరణ్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.నిజానికి రామ్ చరణ్ కు చిన్నప్పటినుంచి సినిమాలంటే పెద్దగా ఇష్టం లేదట ఆయన ఏదైనా మంచి బిజినెస్( Business ) చేయాలని ఆలోచించే వారట కానీ తన బాబాయ్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆయనకు ప్రేక్షకుల నుంచి వస్తున్నటువంటి క్రేజ్ చూసి మనకి కూడా ఇలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే బాగుంటుంది కదా అని ఆలోచించారంట ఈ ఆలోచన వచ్చినప్పటి నుంచి తన మనసు సినిమాలపైకి వెళ్లిందని ఆ కారణంతోనే సినిమాలలోకి వచ్చారని తెలుస్తోంది.

Telugu Chiranjeevi, Panindia, Pawan Kalyan, Ram Charan, Upasana-Movie

ఇక సినిమాలలోకి వచ్చిన తర్వాత బిజినెస్ అంటే పెద్దగా ఐడియా కూడా లేకుండా పోయిందని తనకు సినిమా తప్ప మరే బిజినెస్ తెలియదు అంటూ ఇటీవల కాలంలో రామ్ చరణ్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.ఇక ఈయనకు చిన్నప్పుడు బిజినెస్ అంటే ఇష్టం ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం బిజినెస్ ఉమెన్ పెళ్లి చేసుకొని జీవితంలో సంతోషంగా ఉన్నారు.ఇక రాంచరణ్ కు సినిమాని ఒక బిజినెస్ అని నాకు సినిమా తప్ప మరి ఇది తెలియదని తెలిపారు.ఇలా సినిమాలే తన లైఫ్ అయినప్పటికీ అప్పుడప్పుడు ఈయన పలు రంగాలలో పెట్టుబడులు కూడా పెడుతూ ఉంటారు.

Telugu Chiranjeevi, Panindia, Pawan Kalyan, Ram Charan, Upasana-Movie

ఇలా బిజినెస్ రంగంలో పెట్టుబడులు పెట్టే ఆ బిజినెస్ లో కనుక ఈయన మంచి సక్సెస్ అందుకుంటే చాలా సంతోష పడతారని తెలుస్తుంది.ఈయన బిజినెస్ లో సక్సెస్ అయినప్పుడు వచ్చే సంతోషం మాటలలో వర్ణించలేనిదట ఒక సినిమా మంచి సక్సెస్ అందుకొని ఎన్నో అవార్డులు వచ్చినా కూడా రాని సంతోషం తను మాత్రం బిజినెస్ లో సక్సెస్ అయి మంచి లాభాలు అందుకుంటే వస్తుందని తెలుస్తుంది.చిన్నప్పుడే బిజినెస్ మెన్( Businessman ) అవ్వాలని కలను పక్కనపెట్టి హీరోగా రానిస్తున్నటువంటి ఈయన అక్కడ కూడా సక్సెస్ అయితే కనుక ఎంతో సంతోష పడతారని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube