చెరుకు రసం.పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఇష్టపడి దీనిని తీసుకుంటుంటారు.
రుచి అద్భుతంగా ఉండే చెరుకు రసంలో పోషకాలు కూడా మెండుగానే ఉంటాయి.ఐరన్, పొటాషియం, మెగ్నిషియం, కాల్షియం, ప్రోటీన్స్, విటమిన్స్, ఎలక్ట్రోలైట్స్, కార్బొహైడ్రేట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషకాలు చెరుకు రసం ద్వారా పొందొచ్చు.
అందుకే చెరుకు రసం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతుంటారు.అయితే ఆరోగ్యానికే కాదు.
చర్మ సౌందర్యానికి కూడా చెరుకు రసం ఎంతో మేలు చేస్తుంది.
ఎన్నో చర్మ సమస్యలను కూడా దూరం చేస్తుంది.
మరి చర్మానికి చెరుకు రసాన్ని ఎలా ఉపయోగించాలి అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముఖంపై మొటిమలను తగ్గించడంలో చెరుకు రసం గ్రేట్‌గా సహాయపడుతుంది.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో చెరుకు రసం మరియు నిమ్మ రసం వేసి బాగా మిక్స్ చేసుకుని.ముఖానికి అప్లై చేయాలి.
ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా తరచూ చేస్తే.
క్రమంగా మొటిమలు మటుమాయం అవుతాయి.
అలాగే చర్మ కాంతిని రెట్టింపు చేయడంలోనూ చెరుకు రసం ఉపయోగపడుతుంది.ఒక బౌల్‌లో చెరుకు రసం మరియు చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.
నెమ్మదిగా మసాజ్ చేయాలి.బాగా డ్రై అయిన తర్వాత గోరు వెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఇలా వారంలో రెండు సార్లు చేస్తే.ముఖం కాంతివంతంగా, అందంగా మెరుస్తుంది.
ఇక చెరుకు రసాన్ని ముఖానికి డైరెక్ట్‌గా అప్లై చేసి.నాలుగు లేదా ఐదు నిమిషాల పాటు వేళ్లతో మెల్ల మెల్లగా మసాజ్ చేసుకోవాలి.ఆ తర్వాత పావు గంట పాటు వదిలేసి.అనంతరం కూల్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.
ఇలా రెగ్యులర్‌గా చేస్తే.చర్మంపై ముడతలు, సన్నని గీతలు పోయి ముఖం యవ్వనంగా, మృదువుగా మారుతుంది.