పేటలో కౌంటింగ్ కి పటిష్ఠ ఏర్పాట్లు...!

సూర్యాపేట జిల్లా:ఈ నెల 3న జరిగే ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో పటిష్ఠ ఏర్పాట్లు చేపట్టామని కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి ఎస్.వెంకట్రావ్ అన్నారు.

 Strong Arrangements For Counting In Peta , Peta, Strong Arrangements, Sp Rahul H-TeluguStop.com

శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ నందు నాలుగు నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్స్ తో పాటు కౌంటింగ్ హాల్స్ ను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తో కలసి పరిశీలించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ కౌంటింగ్ రోజున ప్రతి నియోజకవర్గం హాల్లో 14 చొప్పున మొత్తం 56 టేబుల్స్ ఏర్పాటు చేసి, ప్రతి టేబుల్ కి మైక్రో అబ్జర్వర్లు,కౌంటింగ్ సూపర్వైజర్లు,కౌంటింగ్ అసిస్టెంట్లు అలాగే పార్టీ ఏజెంట్లతో పాటు సర్వీస్ అందించేందుకు 50 మంది రెవెన్యూ సిబ్బంది ఉంటారని తెలిపారు.

కౌంటింగ్ రోజున నిఘా నీడలో పటిష్ఠ భద్రత కల్పిస్తున్నామన్నారు.హుజూర్ నగర్ 308 పోలింగ్ కేంద్రాలకు 22 రౌండ్స్,కోదాడ 296 పోలింగ్ కేంద్రాలకు 22 రౌండ్స్,సూర్యాపేట 271 పోలింగ్ కేంద్రాలకు 20 రౌండ్స్,అలాగే తుంగతుర్తి లోని 326 పోలింగ్ కేంద్రాలకు 24 రౌండ్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

అదే విదంగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కొరకు హుజూర్ నగర్ కౌంటింగ్ హల్ కు 4 టేబుల్స్,కోదాడకు 5 టేబుల్స్,సూర్యాపేటకు 6 టేబుల్స్,తుంగతుర్తి కి 3 టేబుల్స్ మొత్తం 18 టేబుల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు.ఎప్పటికప్పుడు కౌంటింగ్ వివరాలను పాత్రికేయ మిత్రులకు తెలుపుటకు మార్కెట్ యార్డ్ నందు మీడియా సెంటర్ ఏర్పాటు చేశామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో తుంగతుర్తి ఆర్ఓ,అదనపు కలెక్టర్ ఏ.వెంకట్ రెడ్డి,సూర్యాపేట ఆర్ఓ వీరబ్రహ్మచారి, కోదాడ ఆర్ఓ సూర్యనారాయణ, హుజూర్ నగర్ ఆర్ఓ జగదీశ్వర్ రెడ్డి, తహశీల్దార్లు,ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube