ప్రజాస్వామ్యం దేశంలో ధనస్వామ్యం నడుస్తుంది: ఎంపీ ఆర్.కృష్ణయ్య

సూర్యాపేట జిల్లా: ప్రజాస్వామ్యం దేశంలో ధనస్వామ్యం నడుస్తుందని, 56 శాతం ఉన్న బీసీలకు నేటివరకు 14శాతమే అవకాశాలు వచ్చాయని,జనాభా దామాషా ప్రకారం అవకాశం రానప్పుడు ప్రజాస్వామ్యం ఎలా అవుతుందని బీసీ సంఘం నేత,వైఎస్సార్ టిపి ఎంపీ అర్.కృష్ణయ్య అన్నారు.

 Money Runs In A Democratic Country Mp R Krishnaiah Details, Mp R Krishnaiah, Bc-TeluguStop.com

శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చట్ట సభల్లో 50 శాతం రిసర్వేషన్ పేట్టే వరకు ఉద్యమం ఆగదని,56 శాతం ఉన్న బీసీలకు 75 ఏళ్లుగా అన్యాయం జరుగుతుందని అవేదన వ్యక్తం చేశారు.దేశ సంపదలో బీసీల భాగస్వామ్యం ఎక్కువని, కానీ,రాజ్యాంగపరంగా న్యాయమైన వాటా రావడంలేదన్నారు.

బీసీల అభివృద్ధి అడ్డుకుంటే బీసీ కుల సంఘాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు.ఇప్పటి వరకు పాలించిన ప్రభుత్వాలన్నీ అగ్రకుల ధోరణితో కూడిన ప్రభుత్వాలని,బీసీ ప్రధాని ఉన్నారు కాబట్టి బీసీలు గట్టిగా కొట్లాడాలన్నారు.

జరుగుతున్న అన్యాయం పై బీసీలు ఆత్మపరిశీలన చేసుకోవాలని,బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని,బీసీల ప్రతి కుటుంబానికి 50 లక్షల సబ్సిడీ ఋణాలు ఇవ్వాలని,రాజకీయ అవసరాల కోసం బీసీలను వాడుకుంటున్నారని,బీసీలు బానిసత్వ మనస్తత్వం వదలాలనిసూచించారు.

పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టేవరకు పోరాటం ఆగదని,పార్టీలకు అతీతంగా బీసీలు తెగించి పోరాడాలన్నారు.

వైఎస్సార్ సీపీ మాత్రమే బీసీ బిల్లు కోసం పార్లమెంటులో కొట్లాడిందని గుర్తు చేశారు.జంతువులకు జనగణన ఉన్న దేశంలో బీసీ జనాభాకు గణన ఉండదా వాపోయారు.

ఏప్రిల్ 3 చలో ఢిల్లీలో భాగంగా పార్లమెంట్ ముందు జరిగే ధర్నాకు వేలాదిగా బీసీలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube