దశాబ్ది ఉత్సవాల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్

సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్రం సిద్ధించి పది సంవత్సరాల అవుతున్న సందర్భంగా తెలంగాణలో అభివృద్ధి జరిగిందనే పేరుతో ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నాడని,దశాబ్ది ఉత్సవాలను కోట్లాది రూపాయల ఖర్చుతో జరపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఐ.ఎఫ్.టి.యు జాతీయ ప్రధాన కార్యదర్శి టి.శ్రీనివాస్ అన్నారు.ఏప్రిల్ 17,18,19 తేదీలలో తిరుపతిలో జరిగిన ఐ.

 Kcr Is Cheating Telangana People In The Name Of Decade Celebrations, Cm Kcr , Te-TeluguStop.com

ఎఫ్.టి.యు జాతీయ మహాసభలలో సూర్యాపేట జిల్లా మోతె మండలం బోడబండ్లగూడెం గ్రామానికి చెందిన టి.శ్రీనివాస్ ఐ.ఎఫ్.టి.యు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన తర్వాత బుధవారం తొలిసారి సూర్యాపేటకు వచ్చిన సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏమి సాధించిందని దశాబ్ద ఉత్సవాలను జరుపుతున్నారని ప్రశ్నించారు.నీళ్ళు,నిధులు,నియామకాలను గాలికి వదిలేసి కార్పొరేట్ శక్తులకు వత్తాసు పలుకుతూ ప్రజా సంపదను దోచుకుంటున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచుటకు కనీస వేతనాలను ఎందుకు అమలు చేయడం లేదని, ఆ 70 రకాల జీవోలను ఎందుకు సవరించడం లేదని,4 జీవోలను సవరించిన గెజిట్ పబ్లికేషన్ చేయలేదని అన్నారు.కనీసం ప్రభుత్వ రంగ సంస్థలలో పని చేస్తున్న 3లక్షల పైగా కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కు పిఎఫ్,ఈఎస్ఐను అమలు చేయడం లేదు కానీ, రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చేశామని గొప్పలకు పోవడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

అసంఘటిత రంగ హమాలీ,ఆటో, మోటార్ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని,భద్రతతో కూడిన సమగ్రమైన చట్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కార్పొరేట్ లకు అనుకూలమైనవని అన్నారు.

తప్పుడు విధానాలతో ఈ వ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్నారని,మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రజల మధ్య కుల,మతాల చిచ్చు రాజేస్తుందని విమర్శించారు.బీజేపీ పట్ల అన్ని వర్గాల ప్రజలు జాగురుతతో ఉండాలని అన్నారు.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఐ.ఎఫ్.టి.యు జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య,జిల్లా ఉపాధ్యక్షులు కునుకుంట్ల సైదులు,జిల్లా కమిటీ సభ్యులు సామ నర్సిరెడ్డి, హమాలి ఫెడరేషన్ జిల్లా నాయకులు ఒగ్గు వెంకన్న, బండి రవి,పురుషోత్తం, రఫీ,ఉప్పలయ్యా,హరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube