యాదాద్రి భువనగిరి జిల్లా: అడ్డగూడూరు మండల పరిధిలోని కోటమర్తి గ్రామంలో వీధి కుక్కల బెడద రోజురోజుకు పెరిగిపోతోంది.గురువారం చిత్తలూరి పూలమ్మ బజార్కు వెళ్లి వస్తుండగా ఒకేసారిగా 10 వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.
రక్తపు మడుగులో ఉన్న పూలమ్మను స్థానికులు అడ్డగూడూరు లోని ప్రాథమిక చికిత్స నిమిత్తం ప్రైవేటు దవాఖానకు తరలించారు.
గ్రామంలో వీధి కుక్కల బెడద తగ్గించి,వీధి కుక్కలను నివారించి ప్రజల ప్రాణాలను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఇదే విషయంపై సర్పంచ్ ను వివరణ అడగగా అధికారులతో మాట్లాడి ఈ సమస్యపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.