రహదారుల విస్తరణ 30 రోజుల్లో పూర్తి చెయ్యాలి.అధికారులకు మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశాలు.
కోర్టు చౌరస్తా నుండి ఎస్వి కళాశాల వరకు పరిశీలన.అనంతరం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష.
సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో రహదారుల విస్తరణను వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు.30 రోజులలో విస్తరణ పూర్తి కావాలని ఆయన సూచించారు.అవసరం అనుకుంటే అదనపు సిబ్బందిని నియమించైనా విస్తరణ పనులలో జాప్యం లేకుండా పూర్తి చెయ్యాలన్నారు.పట్టణంలో జరుగుతున్న రహదారుల విస్తరణ పనులను మంత్రి జగదీష్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.
కోర్టు చౌరస్తా నుండి ఎస్వి కళాశాల దాకా జరుగుతున్న నిర్మాణపు పనులను పరిశీలించారు.అనంతరం తన క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి,ఎస్పి రాజేంద్రప్రసాద్ మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి లతో పాటు సంబంధిత అధికారులతో రహదారుల విస్తరణ పనులపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
పనుల పురోగతిపై సమీక్షించిన మంత్రి జగదీష్ రెడ్డి 30 రోజుల వ్యవధిలో పూర్తిచేయాలని ఆదేశించారు.







