అమెజాన్ అలెక్సా సరికొత్త ఒరవడి.. చనిపోయిన వారి వాయిస్‌తో మాట్లాడేలా టెక్నాలజీ రాబోతోంది!

ఈమధ్యకాలంలో ప్రజలు డిజిటల్ వాయిస్ అసిస్టెంట్ డివైజ్‌లను ఎక్కువగా వినియోగిస్తున్నారు.ఈ క్రమంలో అమెజాన్ అలెక్సా, అమెజాన్ ఏకో, గూగుల్ హోమ్ వంటివి పాపులర్ అవడం మనకు తెలిసిందే.

 Amazon Alexa Is The Latest Trend , Amazon, Alexa, Technology Updates, Technology-TeluguStop.com

యూజర్ల అభిరుచి మేరకు వివిధ కంపెనీలు వాయిస్ అసిస్టెంట్ టెక్నాలజీని రోజురోజుకూ అభివృద్ధి చేస్తున్నాయి.ప్రస్తుతం అమెజాన్ అలెక్సా అమితాబ్ బచ్చన్‌ వంటి పలువురు సెలబ్రిటీల వాయిస్‌ను మిమిక్రీ చేస్తూ యూజర్లను ఆకర్షిస్తోంది.

ఇకపోతే, అమెజాన్ సంస్థ తన అలెక్సా సాధారణ వ్యక్తులను కూడా అనుకరించేలా ఓ సంచలన అప్‌డేట్ తీసుకు రావడానికి సిద్ధం అవుతోంది.

ప్రస్తుతం అమెజాన్ వాయిస్ టెక్నాలజీని వేరే లెవెల్‌కి తీసుకెళ్తుంది.

ఇక ఈ అప్డేట్ సాయంతో యూజర్లు తమకిష్టమైన వారి వాయిస్‌లో అలెక్సా మాటలను వినడం సాధ్య పడుతుంది.ఈ క్రమంలో చనిపోయిన వారి గొంతును కూడా అలెక్సా అనుకరించేలా అమెజాన్ కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టబోతోంది.

ఇందులో భాగంగా అలెక్సా చనిపోయిన వారి వాయిస్‌ను అలాగే అచ్చు గుద్దినట్లు మిమిక్రీ చేసేలా టెక్నాలజీని తీసుకొస్తోంది.ప్రియమైన వారి వాయిస్ లేదా చనిపోయినవారి వాయిస్‌ను ఒక నిమిషం కంటే తక్కువసేపు రికార్డ్ చేస్తే.

ఆ శాంపిల్‌ను అలెక్సా విని.ఆ వాయిస్‌ను చాలా పర్ఫెక్ట్‌గా అనుకరిస్తుంది.

Telugu Alexa, Amazon, Assistant, Ups-Latest News - Telugu

తద్వారా యూజర్లు అలెక్సా నుంచి వినిపించే అన్ని మాటలను తమకు ఇష్టమైన వారి వాయిస్‌లో లేదా చనిపోయిన వారి స్వరంలో వినగలుగుతారు.ఇలా వినడం సంబంధిత వ్యక్తులకు ఓ మంచి ఎక్స్‌పీరియన్స్ అని చెప్పవచ్చు.AI (అమెజాన్ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), ML (మెషిన్ లెర్నింగ్) కాన్ఫరెన్స్ Re:MARS 2022 లాస్ వెగాస్‌లో జూన్ 21 నుంచి జూన్ 24 వరకు జరిగింది.ఈ కాన్ఫరెన్స్ సందర్భంగా అమెజాన్‌ అలెక్సా ఏఐ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ సైంటిస్ట్ రోహిత్ ప్రసాద్ ఒక డెమో ప్రదర్శించారు.

ఈ డెమోలో అలెక్సా డివైజ్ చనిపోయిన వ్యక్తి వాయిస్‌ని అద్భుతంగా మిమిక్రీ చేయడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube