సూర్యాపేట జిల్లా:ఇటీవల మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి నిరుపేద కుటుంబానికి చెందిన దైద మానస కుడికాలును హైదరాబాద్ ప్రైవేట్ హాస్పటల్లో వైద్యులు పూర్తిగా తొలగించారు.నా భార్య వైద్యఖర్చులు ఇప్పటికే లక్షల్లో అయినవని,ఇంకా మూడు,నాలుగు నెలలు వైద్యచికిత్స అందించాలని,
అంత స్తోమత తనకు లేదని, తనకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని,తన కుటుంబ పరిస్థితిని గుర్తించి నా భార్య వైద్య ఖర్చులకు ఆర్ధిక సహాయంతో ఆదుకోవాలని దైద బాలస్వామి (ఆటో డ్రైవర్) వేడుకుంటున్నాడు.