దెబ్బకు దిగొచ్చిన అధికారులు-మద్దతు ధరతో ధాన్యం కొనుగోళ్లు

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని నూతన వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లలో కనీస మద్దతు ధర ఇవ్వకుండా రైతులను అన్యాయం చేస్తున్నారని ఆగ్రహించిన అన్నదాతలు శనివారం ఉదయం నుండి ఆందోళన చేపట్టి,కాంటా మిషన్లు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.అంతటి ఆగకుండా రాత్రి వరకు ఆందోళన కొనసాగించడంతో స్పదించిన జిల్లా కలెక్టర్ టి.

 Declining Officers-grain Purchases At Support Price-TeluguStop.com

వినయ్ కృషారెడ్డి మార్కెట్ యార్డ్ ను సందర్శించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించి,మద్దతు ధరతో కొనుగోలు చేస్తారని రైతులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విమరమించారు.

కలెక్టర్ ఆదేశాలతో ఆదివారం వ్యవసాయ మార్కెట్ లో ఉదయం ఏడు గంటలకే మద్దతు ధరతో కాంటాలు ప్రారంభించడంతో ప్రశాంతంగా ధాన్యం ఎగుమతులు జరుగుతున్నాయి.పెరిగిన ధరలతో కొనుగోళ్లు జరుగుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube