సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండలం( Anantha Giri ) గొండ్రియాల నుండి కొత్తగూడెం వరకు చేపట్టినబీటీ రోడ్డు నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కంకర,డస్ట్ పరిచి ఏడాది గడుస్తున్నా పట్టించుకోవడం లేదని,వాహనదారులు,స్థానికులుతీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గత నెలలో దినపత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించిన అధికారులు కాంట్రాక్టర్ అప్రమత్తం చేయడంతో ఎన్నికల వేళ అధికారులు ఎన్నికల వీధుల్లో బిజీగా ఉన్న సమయం చూసి ఇష్టారాజ్యంగా బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టారు.
రోడ్డు నిర్మాణం జరుగుతున్నందుకు స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తూనే,రోడ్డు నిర్మాణ పనులు నాసిరకంగా ఉన్నాయని ఆరోపిస్తున్నారు.
రోడ్డు నిర్మాణ పనుల్లో క్యూరింగ్ పెట్టకుండా,డోజర్ తొక్కించకుండా బీటీ వేయడంతో రోడ్డు నాసిరకంగా ఉందని,ఒక భారీ వర్షం( Heavy rain ) వస్తే మొత్తం రోడ్డు కొట్టుకుపోయే ప్రమాదముందని,కాంట్రాక్టర్ తూతూ మంత్రంగా పనులు ముగించుకుని బయటపడే ప్రయత్నం చేస్తున్నా సంబంధిత అధికార యంత్రాంగం చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రజా ధనంతో ప్రజల రవాణా సౌకర్యం కోసం ఏర్పాటు చేస్తున్న బీటీ రోడ్డు నిర్మాణం కాంట్రాక్టర్ అలసత్వం కారణంగా ప్రజాధనం వృథా అవుతుందని వాపోతున్నారు.
ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి బీటీ రోడ్డు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి,కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని,సరైన నాణ్యతా ప్రమాణాలతో బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.







