సూర్యాపేట జిల్లా:దేశంలో భారత రాజ్యాంగాన్ని మార్చివేసి మనుస్మృతిని అమలు చేయాలనే ఆర్ఎస్ఎస్ కుట్రలో భాగంగానే బుధవారం హైదరాబాదులో మనుస్మృతి పుస్తకాన్ని ఆవిష్కరించారని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి అన్నారు.మనుస్మృతి పుస్తకావిష్కరణకు నిరసనగా కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లా కేంద్రంలోని రైతు బజార్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహం ముందు మనుస్మృతి ప్రతులను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో కేంద్రంలో మోడీ పరిపాలన కొనసాగిస్తున్నాడన్నారు.మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన నుండి భారత రాజ్యాంగాన్ని మార్చివేయాలనే కుట్రలు వేగంగా జరుగుతున్నాయన్నారు.
ఈ దేశంలో అసమానతలు సృష్టించే మనస్మృతిని మళ్లీ ఆవిష్కరణ చేయడానికి చూస్తే ఆర్ఎస్ఎస్ కుట్రలో భాగంగానే ఇలాంటి ఆవిష్కరణలు జరుగుతున్నాయన్నారు.దేశంలోని అన్ని వర్గాల ప్రజలు సమానంగా బ్రతకాలని సూచించిన అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవలన్నారు.
రాజ్యాంగ రక్షణ కోసం అన్ని వర్గాల ప్రజలు మనువాదుల కుట్రలను తిప్పికొట్టేందుకు ఐక్యంగా ఉద్యమించాలన్నారు.ఆర్ఎస్ఎస్ కనుసైగలతోటే హమారా ప్రసాద్ అనే దుర్మార్గుడు అంబేద్కర్ని అవమానపరుస్తూ వ్యాఖ్యానాలు చేశాడని పేర్కొన్నారు.
హమారా ప్రసాద్ వ్యాఖ్యలను ప్రజాస్వామికవాదులు తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు.అంబేద్కర్ ని అవమానపరిచిన హమారా ప్రసాదును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా నాయకులు ఉదయ్, రవి,నాగరాజు,నరేష్ నాయక్,మరికంటి మహేష్,మల్లెల మధు, వినోద్,ముత్యాలు,మంద సతీష్,రెడపంగ రమేష్, శ్రీకాంత్,సందీప్,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.