నల్లగొండ జిల్లా:జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో( Abhinav Stadium ) సోమవారం నుండి ప్రారంభమయ్యే సీఎం కప్ 2023 జిల్లా స్థాయి టోర్నమెంట్ ను రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గంటకండ్ల జగదీష్ రెడ్డి( Gantakandla Jagdish Reddy ) లాంఛనంగా ప్రారంభించారు.అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ యువకుల్లో క్రీడా స్పూర్తిని నింపడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నదన్నారు.
తెలంగాణలో వెయ్యికి పైగా గురుకులాలను ఏర్పాటు చేసి, విద్యార్థులకు ఉన్నతమైన చదువు అందించేలా ముఖ్యమంత్రి కృషి చేశారని,తెలంగాణ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా ప్రభుత్వం తయారు చేస్తున్నదన్నారు.విద్యార్థులు ఓటమి నుంచి గెలుపుకి పునాది వేసుకోవాలని సూచించారు.
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని,విద్యార్థుల చదువు ఎంత ముఖ్యమో ఆటలు అంతే ముఖ్యమనిఅన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్, జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి,నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి,మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు,మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి,గ్రంధాలయ చైర్మన్ మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.