సూర్యాపేట జిల్లా:సమాజంలో శాస్త్రీయ వైఖరులు పెంపొందించాలని కోదాడ ఆర్డిఓ కిషోర్ కుమార్ అన్నారు.శుక్రవారం ఆర్డీవో కార్యాలయ ఆవరణలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ గోడపత్రికలను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు.
మూఢనమ్మకాల నిర్మూలనలో జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు.సైన్స్ ఫలాలను ప్రజలకు అందించాలన్నారు.
జిల్లా అధ్యక్షులు గొల్లమూడి రమేష్ బాబు,ప్రధాన కార్యదర్శి శ్రీరాములు,ఆంజనేయులు మాట్లాడుతూ చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ లు నవంబర్ 18న పాఠశాల స్థాయి నవంబర్ 22న మండల స్థాయి నవంబర్ 27న జిల్లాస్థాయి డిసెంబర్ 9 10 11 తేదీల్లో రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి షేక్ జాఫర్,రాష్ట్ర నాయకులు డిఎం స్వామి,జిల్లా కార్యదర్శి బడుగుల సైదులు,జిల్లా ఉపాధ్యక్షులు రామ నరసయ్య,అంజయ్య,జిల్లా నాయకులు కే.ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.