కులాల మధ్య వివక్ష వద్దు:ఎర్రమళ్ళ రాములు

సూర్యాపేట జిల్లా:30 లక్షల మంది పైగా మాలలు,మాలల అనుబంధ కులాలు ఉన్నాయన్న వాస్తవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) గ్రహించాలని,ఎస్సీ కులాల మధ్య వివక్ష చూపించవద్దని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ రాష్ట్ర నాయకులు ఎర్రమళ్ళ రాములు అన్నారు.ఆదివారం స్థానిక మాలల కమ్యూనిటీ కార్యాలయంలో జరిగిన చర్చ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.2011 జనాభా లెక్కలు కాకుండా తెలంగాణ ఏర్పడిన నాటి నుండి లెక్కలు సేకరించాలని డిమాండ్ చేశారు.ఎస్సీ వర్గీకరణ కాదని, ముఖ్యంగా క్రిమిలేయర్ వల్ల మాలల్లో,మాదిగల్లో పూర్తిగా ఉద్యోగ ఉపాధి రంగాలలో తీరని నష్టం జరుగుతుందని వాపోయారు.

 No Discrimination Between Castes:ramulu , Suryapet District , Discrimination-TeluguStop.com

ప్రధానంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పూర్తిగా రాజ్యాంగంలోని 341 ఆర్టికల్ కు వ్యతిరేకంగా ఉందని వివరించారు.ప్రభుత్వం రాజకీయ అభివృద్ధి కావాలి అంటే కులాల మధ్య వివక్షత చూపించవద్దని,గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి జరిగిన అవమానాలు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీకి జరగవద్దని హితవు పలికారు.

ఎస్సీ వర్గీకరణ జరపాలి అంటే పార్లమెంటులో చట్టం తేవడం,రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం ద్వారా మాత్రమే జరగాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం లేదని తేల్చి చెప్పారు.న్యాయవ్యవస్థ అయిదు గురించి జడ్జి క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా కేవలం పంజాబ్ రాష్ట్రానికే పరిమితమైన ఈ అంశాన్ని అన్ని రాష్ట్రాలకు వర్తించే విధంగా చేయాలని కోరడం,ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మందకృష్ణ మాదిగ బ్లాక్ మెయిల్ విధానాలకు తలవగ్గ వద్దని కోరారు.

మందకృష్ణ మొదటి నుండి కూడా మాలల వ్యతిరేకిగా ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నాశనం కావడానికి కారణమయ్యాడని,నేడు అదే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తే అదే పతనం తప్పదని జోష్యం చెప్పారు.ప్రభుత్వాలు సవ్యంగా కొనసాగాలంటే వర్గీకరణ జోలికి పోవద్దని, గత ప్రభుత్వం అనుభవాలను అధ్యయనం చేయాలని విజ్ఞప్తి చేశారు.

గత అనుభవాలను అధ్యయనం చేయకుండా మందకృష్ణ మాదిగ ఒత్తిళ్లకు తలవగ్గి ఎస్సీ వర్గీకరణ జరిపితే జరిగే పరిణామాలకు కాంగ్రెస్ పార్టీ నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.విద్యా, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లను ఈనాటికి కూడా సరిగ్గా అమలు చేయలేదని,35 వేలకు పైగా బ్యాక్ లాగ్ పోస్టులు ఉన్నాయని,రోస్టర్ విధానాన్ని అమలు పరచడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు.

ఎస్సీల మీద ఏమాత్రం ప్రేమ అభిమానాలు ఉన్నా వెంటనే రోస్టర్ విధానాన్ని అమలుపరచాలని, వర్గీకరణను వ్యతిరేకించాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ వచ్చే నెల చివరి వారంలో జరిగే భారీ బహిరంగ సభకు లక్షలాదిగా తరలిరావాలని, మాలలందరూ తమ సత్తా చాటుకోవడానికి బహిరంగ సభ కార్యక్రమంలో విధిగా, తమ వంతు బాధ్యతగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ సూర్యాపేట అధ్యక్షుడు వేణు బలరాం, కట్ట సైదులు,కట్ట మురళి, గండమల్ల వినయ్,జంగం కరుణాకర్,గండమల్ల గిరి, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube