వస్రాం తండా సమస్యలు పరిష్కరించాలి:కొత్తపల్లి శివకుమార్

వస్రాం తండాలో నెలకొన్న సమస్యలను యుద్ధప్రాతిపదిన పరిష్కరించాలని అధికారులకు మంత్రి సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా సూర్యాపేట జిల్లా కమిటీ తరపున విజ్ఞప్తి చేస్తున్నామని పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ ( Kottapalli Sivakumar )అన్నారు.సోమవారం ప్రజాపోరు యాత్ర 25వ రోజు కొనసాగింపుగా వస్రాం తండాను చేరుకొని ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

 Vasram Tanda Issues Should Be Resolved Kottapalli Sivakumar , Kottapalli Sivakum-TeluguStop.com

అనేక సమస్యలతో సతమతమవుతూ రోగాల బారిన పడుతూ జీవితాన్ని గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు.గత 30 సంవత్సరాల నుంచి సువెన్ ఫార్మసీ వల్ల భూకాలుష్యం,నీటి కాలుష్యం,గాలి కాలుష్యంతో అక్కడ భూసారం తగ్గి పంటలు కాలుష్యం బారిన అవుతున్నాయని,ఆహార పంటలను తిన్న ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని అన్నారు.

ఏ ప్రభుత్వం వచ్చిన సువెన్ ఫార్మసీకి అమ్ముడుపోయి అధికారులు ప్రభుత్వం వారు కలిసి ఫార్మసీ సీజ్ చేయకుండా ప్రజల జీవితాలతో ఆటలాడుతున్నారని అన్నారు.ఈ రోజు వరకు వస్రం తండాలో మిషన్ భగీరథ నీళ్లు లేక, అదేవిధంగా మురికి కాలువలు సరిగా లేక ప్రజల అవస్థలు పడుతుంటే అధికారులు, వార్డు కౌన్సిలర్ నిద్రమత్తులో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇకనైనా అధికారులు స్పందించి సువెన్ ఫార్మసీని సీజ్ చేసి, మిషన్ భగీరథ( Mission Bhagiratha ) నీళ్లను ప్రజలకు అందించి, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని కోరారు.లేనియెడల మా పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక,పిడిఎస్ యు జిల్లా కార్యదర్శి ఎర్ర అఖిల్,పిఓడబ్ల్యు అధ్యక్ష ఉపాధ్యక్షులు రేణుక, చంద్రకళ,జయమ్మ,పార్టీ జిల్లా నాయకులు నాగన్న, శైలజ,పివైఎల్ జిల్లా నాయకులు పరుశురాం, వీరబాబు,సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube