మొన్న కేజీఎఫ్, నిన్న మాస్టర్.రేపు మరో సినిమా.
పైరసీ, లీకేజ్ అనేది సినిమా ఇండస్ట్రీని వదలని భూతంలా పట్టుకుంది.సినిమా రిలీజ్ అయిన మరుక్షణంలోనే సినిమాలు నెట్ లో ప్రత్యక్షం అవుతున్నాయి.
ఇదే కాదు సినిమా రిలీజ్ కి ముందే మూవీ రిలేటెడ్ పోస్టర్స్, సీన్స్ లీక్ అవుతున్నాయి.సినిమా కోసం పనిచేసే వారే ఈ లీకేజీలకు పాల్పడ్డం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది.
అలా సినిమా విడుదలకు ముందే లీకుల బారిన పడ్డ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గీతా గోవిందం
ఈ సినిమా క్లైమాక్స్ సీన్స్ సినిమా విడుదలకు ముందే నెట్ లో హల్ చల్ చేశాయి.
నిర్మాత ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసుల.సినిమాకు పని చేసిన ఓ వ్యక్తే ఈ లీకేజీకి పాల్పడ్డట్లు గురించారు.
టాక్సీవాలా

డబ్బింగ్ స్టేజ్ లోనే మూవీ పైరసీ కాపీ మొత్తం ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది.ప్లాప్ అనే టాక్ కూడా వచ్చింది.కానీ ఒరిజినల్ మూవీ అద్భుతంగా రావడంతో హిట్ అయ్యింది.
అరవింద సమేత

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చి ఈ సినిమా సైతం పైరసీ అయ్యింది.నాగబాబు తారక్ మధ్య జరిగే సన్నివేశాలు ఇంటర్నెట్ లో దర్శనం ఇచ్చాయి.
బాహుబలి

ఇండియన్ సినిమా స్థాయిని ఓ రేంజికి తీసుకెళ్లిన బాహుబలి మూవీ సైతం సినిమాకు ముందే ఇంటర్నెట్ లోకి ఎక్కింది.ఎడిటింగ్ లో ఉండగానే కొన్ని యుద్ధ సన్నివేశాలు లీక్ అయ్యాయి.
బాహుబలి2

తొలి భాగంలో వార్ సీన్స్ లీక్ కాగా.రెండో పార్ట్ కు సంబంధించి 50 నిమిషాల మూవీ పైరసీ అయ్యింది.ఈ కేసు విచారించిన పోలీసులు కొంత మందిని అరెస్టు చేశారు.
అప్పటికూ ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
జై లవకుశ

జూనియర్ ఎన్టీఆర్ త్రిపుల్ రోల్ చేసిన ఈ సినిమాలోని చాలా సీన్స్ సినిమా విడుదలకు ముందే లీక్ అయ్యాయి.మూవీ ప్రొడక్షన్ టీమ్ ఫస్ట్ లుక్ విడుదల చేద్దాం అనుకునే లోపే జై క్యారెక్టర్ పోస్టర్ ఇంటర్నెట్ లో లీక్ అయ్యింది.
కేజీఎఫ్ 2

సౌత్ ఇండియా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ 2 టీజర్ రిలీజ్ డేట్ కన్నా ఒక్క రోజు ముందే యూట్యూబ్ లో ప్రత్యక్షం అయ్యింది.
మాస్టర్

సంక్రాంతికి విడుదల అయిన మాస్టర్ మూవీలో చాలా క్లిప్పులు ఇంటర్నెట్ లో కనిపించాయి.
రోబో 2.0

ఈ సినిమా టీజర్ క్లిప్పింగ్స్ అఫీషియల్ గా రిలీజ్ చేయక ముందే ఇంటర్నెట్ లో పెట్టారు.
రంగస్థలం

ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, ప్రమెషనల్ డేటాను ఇంటర్నెట్ లో లీక్ చేశారు.