సూర్యాపేట జిల్లా:ప్రస్తుత వానకాలం సీజన్ నుంచే ప్రతి రైతు కూడా తమ కుటుంబాల కోసం ప్రకృతి వ్యవసాయం చేపట్టాలని వ్యవసాయ సామాజిక కార్యకర్త మొలుగూరి గోపయ్య కోరారు.బుధవారం అనంతగిరి మండలం చనుపల్లి, పాలారం,పాలారం తండా, కిష్టాపురం గ్రామాల్లో రైతు చైతన్య యాత్రలో భాగంగా ఆయన చేపట్టిన ప్రకృతి వ్యవసాయం( Natural farming )పై ప్రత్యేక రైతుల సమావేశం( Farmers ) నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాలతో పాటు గ్రామాల్లో కూడా రోజురోజుకీ రోగుల సంఖ్య పెరుగుతుందని, అనేకమంది మృతి చెందుతున్నారని,దానికి కారణం మనం నిత్యం తినే విషపూరిత ఆహారమేనని అన్నారు.
పంటలకు విపరీతంగా రసాయన ఎరువులు,పురుగు మందులు,తెగుళ్ళ మందులు, కలుపు మందులు విపరీతంగా ఉపయోగించడం వలన రోగుల సంఖ్య పెరుగుతుందన్నారు.
అలాగే భూసారం కూడా పూర్తిగా దెబ్బతింటుందని దీంతో భవిష్యత్తులో మానవుని మనుగడ కరువవుతుందన్నారు.అందుకే ప్రతి రైతు కూడా నేల తల్లిని కాపాడుకుంటూ,తమ కుటుంబాలు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా భూసార సంరక్షణకు సేంద్రియ ఎరువు( Organic manure )లైన పశువులపెంట ఉపయోగించాలని,పచ్చి రొట్టె ఎరువులు అయినా జీలుగా,పిల్లి పెసర జనుము,చల్లుకోవాలని అలాగే జీవామృతం ఘన జీవామృతం తయారీ విధానంతో పాటు,సహజ సిద్ధంగా పంటలపై ఆశించే చీడపీడల నివారణ కోసం ద్రావణాల తయారీపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో చనుపల్లి అభ్యుదయ రైతు ఏలేటి వెంకటేశ్వర్ రెడ్డి( Venkateshwar Reddy ),కళ్ళెం కృష్ణారెడ్డి,రాంబాబు తదితర రైతులు పాల్గొన్నారు.