యాషెస్ సిరీస్( Ashes series ) లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి టెస్ట్ లో ఆస్ట్రేలియా( Australia ) ఘనవిజయం సాధించింది.ఇంగ్లాండ్ చేతిలో ఓటమి తప్పదు అనుకుంది కానీ విజయం ఆస్ట్రేలియానే వరించింది.
ఇంగ్లాండ్ నిర్దేశించిన 281 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా అద్భుతంగా చేదించింది.తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ తో ఆస్ట్రేలియా జట్టుకు ఉస్మాన్ ఖవాజా అండగా నిలిచాడు.
ఇక ఆస్ట్రేలియా జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉండి ఓటమి దిశగా సాగుతున్న సమయంలో కెప్టెన్ పాట్ కమిన్స్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి 44 పరుగులు చేశాడు( Usman Khawaja ).దీంతో యాషెస్ సిరీస్ లో 1-0 తేడాతో ఆసిస్ తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.ఆస్ట్రేలియా విజయంతో పలు రికార్డులు బద్దలయ్యాయి.అవి ఏమిటో చూద్దాం.
ఇంగ్లాండ్ గడ్డపై ఇప్పటివరకు ఐదు సార్లు విదేశీ జట్లు అత్యధిక పరుగుల టార్గెట్ ను చేదించాయి.1948లో హెడ్డింగేలో ఆస్ట్రేలియా 404 పరుగుల టార్గెట్ ను చేదించింది.1984లో లార్డ్స్ లో వెస్టిండీస్ 342 పరుగుల టార్గెట్ ఛేదించింది.2017లో హెడ్డింగేలో వెస్టిండీస్ 32 పరుగుల టార్గెట్ ను చేదించింది.2008లో ఎడ్జ్ బాస్టన్ లో దక్షిణాఫ్రికా 281 పరుగుల టార్గెట్ చేదించింది.తాజాగా 2023లో ఆస్ట్రేలియా 281 పరుగుల టార్గెట్ చేదించింది.
యాషెస్ సిరీస్ చరిత్రలో ఆస్ట్రేలియా ఏకంగా ఐదుసార్లు అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.1948లో హెడ్డింగే లో 404 పరుగులు, 1992లో అడిలైట్ లో 315 పరుగులు, 1929లో మెల్బోర్న్ లో 286 పరుగులు, 2023లో ఎడ్జ్ బాస్టన్ 281 పరుగులు, 1897-98లో సిడ్నీలో 275 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఛేదించింది.ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ గడ్డపై టెస్టుల్లో 275 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని 15 సార్లు చేదించింది.2023లోనే ఏకంగా ఐదు సార్లు చేదించింది.టెస్టులలో ఆస్ట్రేలియా కెప్టెన్ లలో బ్యాటింగ్లో రెండు ఇన్నింగ్స్ లకు కలిపి 80 పరుగులు, బౌలింగ్లో నాలుగు వికెట్లు తీసిన ఆరో ఆటగాడుగా పాట్ కమిన్స్( Pat Cummins ) నిలిచాడు.ఒక టెస్టులో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆస్ట్రేలియా కెప్టెన్లలో పాట్ కమిన్స్ రెండో స్థానంలో నిలిచాడు.
ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్టులో కమిన్స్ ఐదు సిక్సర్లు కొట్టాడు.