సూర్యాపేట జిల్లా:మఠంపల్లి మండలం కిందితండా గ్రామ ఓటరు తుది జాబితాలో అప్పుటీ ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీఓ నరేష్,పంచాయతీ కార్యదర్శి సైదులు ఓటరు జాబితాలో అవకతవకలకు పాల్పడినట్లు నిర్దారణ కావడంతో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ముగ్గురిని సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది.కిందితండా గతంలో చెన్నయ్యపాలెం గ్రామపంచాయతీలో ఉండగా ప్రస్తుతం కొత్త పంచాయతీగా ఏర్పడిన విషయం తెలిసిందే.
కొత్తగా తయారు చేసిన డ్రాఫ్ట్ జాబితా సక్రమంగా ఉన్నప్పటికీ తుది జాబితాలో కొంత అవకతవకలు జరిగినట్లు విచారణలో తేలడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం.